Share News

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ లీకేజ్.. చెక్ చేయడానికి వెళ్లిన భార్యాభర్తలు.. తర్వాతేం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:15 PM

గ్యాస్ స్టవ్‌లు వంటింట్లోకి వచ్చాక వంట చేసుకోవడం ఎంతో సులభంగా మారిపోయింది. క్షణాల్లో వంట రెడీ అయిపోతోంది. అయితే గ్యాస్ విషయంలో ఏమరపాటుగా ఉంటే మాత్రం ప్రమాదాలు తప్పవు. తాజాగా ముంబైలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న ఘటనను చూస్తే నివ్వెరపోకతప్పదు.

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ లీకేజ్.. చెక్ చేయడానికి వెళ్లిన భార్యాభర్తలు.. తర్వాతేం జరిగిందంటే..
Gas cylinder leaked

గ్యాస్ స్టవ్‌లు (Gas stove) వంటింట్లోకి వచ్చాక వంట చేసుకోవడం ఎంతో సులభంగా మారిపోయింది. క్షణాల్లో వంట రెడీ అయిపోతోంది. అయితే గ్యాస్ విషయంలో ఏమరపాటుగా ఉంటే మాత్రం ప్రమాదాలు తప్పవు. తాజాగా ముంబైలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న ఘటనను చూస్తే నివ్వెరపోకతప్పదు. గ్యాస్ స్టవ్‌కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో అనుకోకుండా పైప్ ఊడిపోయింది. తిరిగి దానిని పెట్టడానికి ప్రయత్నిస్తే సిలిండర్‌లోని గ్యాస్ అంతా పైప్ ద్వారా వేగంగా బయటకు వచ్చేసింది (Gas Cylinder Leakage).


సిలిండర్‌ను వంట గది నుంచి హాల్‌లోకి తెచ్చిన మహిళ దానిని అక్కడ పడేసి బయటకు పారిపోయింది. సిలిండర్‌లోని గ్యాస్ అంత పైప్ ద్వారా ఇల్లంతా వ్యాపించింది. అయితే కిటికీలు, తలుపులు తెరిచి ఉండడం కాస్త కలిసి వచ్చింది. కొన్ని క్షణాలకు సిలిండర్ నుంచి గ్యాస్ బయటకు రావడం ఆగిపోవడంతో ఆ మహిళ, తన భర్త మెల్లిగా ఇంట్లోకి వచ్చారు. ఆ సిలిండర్‌ను అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరూ వెంటనే బయటకు పారిపోయారు. దీంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.


ఇల్లు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. ఆ ఘటన మొత్తం ఆ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. జూన్ 18న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంటికి ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉండడంతో గ్యాస్ బయటకు వెళ్లిపోయింది. అందువల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

యూఎస్‌లో ఆందోళనలు.. పలు నగరాల్లో హై అలర్ట్

ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ

For More International News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 09:08 PM