Share News

Shashi Tharoor: గాజా శాంతి సదస్సుకు మోదీ దూరం.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 13 , 2025 | 09:54 PM

గాజా శాంతి సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈజిప్టు అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోదీ ఈ సదస్సుకు దూరంగా ఉండేందుకే నిశ్చయించుకున్నారు.

Shashi Tharoor: గాజా శాంతి సదస్సుకు మోదీ దూరం.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shashi Tharoor queston PM MOdi

న్యూఢిల్లీ: ఈజిప్టులో జరుగనున్న గాజా శాంతి సదస్సుకు కేంద్ర సహాయ మంత్రిని పంపుతూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ దౌత్యవేత శశి థరూర్ (Sashi Tharoor) విస్మయం వ్యక్తం చేశారు. కీలకమైన చర్చల్లో భారతదేశ ప్రభావాన్ని తగ్గించే ఈ చర్య వ్యూహాత్మక సంయమనమా? అవకాశాన్ని జారవిడుచుకోవమా? అని ప్రశ్నించారు.


ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈజిప్టు అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోదీ ఈ సదస్సుకు దూరంగా ఉండేందుకే నిశ్చయించుకున్నారు. భారతదేశం తరఫున ప్రతినిధిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను పంపారు. గాజాలో సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికి, శాంతి-సుస్థిరత నెలకొల్పడమే లక్ష్యంగా షర్మ్ ఎల్-షేక్‌లో గాజా శాంతి ఒప్పంద జదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రా్ సహా 20కి పైగా దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.


కాగా, కీర్తి వర్దన్ సింగ్‌ సమర్ధత గురించో, ఆయనను పంపడం గురించో ఇక్కడ ప్రశ్న కాదని, ప్రపంచ దిగ్గజ నేతలు హాజరవుతున్న సదస్సు విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయమే ఆశ్చర్యం కలిగిస్తోందని శశిథరూర్ అన్నారు. ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి తెరపడుతూ శాంతి నెలకొనే దశలో మన దూరంగా ఉండాలనుకోవడం ఫజిలింగ్‌‌గా ఉందన్నారు.


ఇవి కూడా చదవండి..

గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ.. ట్రంప్ శాంతి ప్రయత్నాలపై ప్రశంస

రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 09:56 PM