Share News

West Bengal Stampede: బర్దమాన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 09:53 PM

తొక్కిసలాటలో 10 నుంచి 15 మంది ప్రయాణికులు గాయపడటంతో వారిని హుటాహుటిన బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు పలువురు పురుషులు ఉన్నారు.

West Bengal Stampede: బర్దమాన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
Bardhaman railway staton stampede

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని బర్దమాన్ రైల్వే స్టేషన్ (Bardhaman Railway Station)లో ఆదివారం సాయంత్రం తొక్కిసలాట చోటుచేసుకుంది. పండుగ సీజన్ కావడంతో రద్దీ ఎక్కువగా ఉండటం, 4,5,6 ఫ్లాట్‌ఫామ్‌ల పైకి ఒకేసారి 3 నుంచి 4 రైళ్లు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయడం, మెట్లు ఇరుకుగా ఉండటంతో గందరగోళం చెలరేగిందని, పలువురు ప్రయాణికులు కిందకు దొర్లిపడటంతో గాయపడ్డారని తెలుస్తోంది. హల్దీబరి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను అందుకునేందుకు ప్రయాణికులు పరుగులు పెట్టడం గందరగోళానికి దారితీసిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.


క్షతగాత్రుల తరలింపు

కాగా, తొక్కిసలాటలో 10 నుంచి 15 మంది ప్రయాణికులు గాయపడటంతో వారిని హుటాహుటిన బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు పలువురు పురుషులు ఉన్నారు. రైల్వే వైద్యులు ఘటన స్థలిలోనే ఫస్ట్ ఎయిడ్ అందించి తదుపరి చికిత్స కోసం వారిని ఆసుపత్రికి పంపించారు. కాగా, బాగా గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.


బాధితులను పరామర్శించేదుకు పలువురు రాజకీయ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. రైల్వే భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.తొక్కిసలాట కారణంగా రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఆ తర్వాత తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ, 70 కంటే తక్కువ సీట్లు

ఎన్డీయే డీల్ ఓకే.. జేడీయూ-బీజేపీ చెరిసగం..

For More National News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 09:55 PM