Vijay Home Security Breach: స్టార్ హీరో విజయ్ ఇంట్లో భద్రతా లోపం..!
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:49 AM
చెన్నైలో ప్రముఖ నటుడు విజయ్ ఇంట్లో భద్రతా లోపం చోటుచేసుకుంది. ఓ అగంతకుడు ఆయన నివాసంలోకి ప్రవేశించాడు. టెర్రస్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చెన్నై: ప్రముఖ నటుడు విజయ్ (Vijay Home Security Breach) నివాసంలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఓ అగంతకుడు విజయ్ ఇంట్లోకి చొరబడి, టెర్రస్‌పై తిరుగుతూ కనిపించాడు. ఈ ఘటన చెన్నైలోని విజయ్ నివాసంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే చురుకుగా స్పందించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనతో విజయ్ ఇంటి భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అగంతకుడు ఎలా చొరబడ్డాడు, భద్రతా లోపాలు ఎలా ఉన్నానే దానిపై దర్యాప్తు జరుగుతోంది. నిందితుడి ఉద్దేశాలు, నేపథ్యం గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయ్ అభిమానులు ఈ ఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, తదుపరి చర్యలు చేపడుతున్నారు.
పోలీసుల క్లారిటీ
విజయ్ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని 24 ఏళ్ల మానసిక వికలాంగుడైన అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. అతన్ని ఆసుపత్రిలో చేర్చామని అధికారులు తెలిపారు. విజయ్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్లను దాటి అరుణ్ ఎలా ప్రవేశించాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
విజయ్‌కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై-కేటగిరీ భద్రతను కల్పించింది. ఇందులో సీఆర్‌పీఎఫ్ బృందం ఉంది. ఈ సంఘటన తనకు భద్రతా లోపం ఉందా అనే ప్రశ్నలను లేవనెత్తింది. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ అధినేత విజయ్ గత శనివారం త్రిచీలో తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. రేపు నాగపట్నం వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి