Share News

EPFO Single Login: ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం స్మార్ట్ విధానం.. ఒకే లాగిన్‌తో అనేక సేవలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 10:16 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు శుభవార్త వచ్చింది. ఇకపై EPFO సర్వీసులను ఉపయోగించేందుకు మీరు రెండు వేర్వేరు లాగిన్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తాజాగా కొత్త మార్పులు చేశారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

EPFO Single Login: ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం స్మార్ట్ విధానం.. ఒకే లాగిన్‌తో అనేక సేవలు
EPFO Single Login

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు ఒకే లాగిన్‌తో EPFO అన్ని ముఖ్యమైన సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. అవును ఇకపై రెండు లాగిన్‌లతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త రిఫార్మ్ గురించి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ చేంజ్‌తో సభ్యుల ఫిర్యాదులు తగ్గడమే కాకుండా, పారదర్శకత, సంతృప్తి కూడా పెరుగుతుందన్నారు.


ఒక క్లిక్‌లో అన్నీ

గతంలో EPFO సర్వీసుల కోసం రెండు వేర్వేరు లాగిన్‌లు (మెంబర్ పోర్టల్, పాస్‌బుక్ పోర్టల్) ఉపయోగించాల్సి వచ్చేది. ఇది కొంతమందికి పాస్‌వర్డ్ సమస్యలను తెచ్చేది. కానీ, ఇప్పుడు EPFO 3.0 రిఫార్మ్స్‌లో భాగంగా పాస్‌బుక్ లైట్ అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేశారు. దీంతో మీరు మెంబర్ పోర్టల్‌లోనే మీ కంట్రిబ్యూషన్స్, విత్‌డ్రాయల్స్, ప్రస్తుత బ్యాలెన్స్‌ వంటి వివరాలను సులభంగా చూసుకోవచ్చు.

సింపుల్ వివరాలు

ఈ పాస్‌బుక్ లైట్ ఫీచర్, స్టాండ్‌లోన్ పాస్‌బుక్ పోర్టల్‌పై లోడ్‌ను తగ్గిస్తూ, సర్వీస్ ఎఫిషియన్సీని పెంచుతుంది. మీకు డీటెయిల్డ్ పాస్‌బుక్ లేదా గ్రాఫికల్ డిస్‌ప్లే కావాలంటే, పాత పాస్‌బుక్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. అంటే, సింపుల్ వివరాల కోసం పాస్‌బుక్ లైట్, డీటెయిల్డ్ రికార్డ్ కోసం పాస్‌బుక్ పోర్టల్ రెండూ మీకు అందుబాటులో ఉంటాయి.


ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్

జాబ్ మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా గతంలో కొంత కష్టంగా ఉండేది. ఫార్మ్ 13 ద్వారా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, అనెక్సర్ K అనే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను PF ఆఫీసుల మధ్య షేర్ చేసేవారు. సభ్యులు దీన్ని చూడాలంటే ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మెంబర్ పోర్టల్‌లోనే అనెక్సర్ Kని PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ రిఫార్మ్‌తో, మీ PF అకౌంట్ బ్యాలెన్స్, సర్వీస్ రికార్డ్ అప్‌డేట్‌లను ట్రాక్ చేయడం సులభం. అంతేకాదు, ఈ డిజిటల్ రికార్డ్ పెన్షన్ బెనిఫిట్స్ క్యాల్కులేషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. అంటే మీ అకౌంట్ గురించి మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది.


క్లెయిమ్ సెటిల్‌మెంట్స్ ఇప్పుడు

EPFO 3.0 రిఫార్మ్స్‌లో మరో కీలక మార్పు ఏంటంటే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను సులభతరం చేయడం. గతంలో PF సర్వీసులు ట్రాన్స్‌ఫర్స్, సెటిల్‌మెంట్స్, అడ్వాన్స్‌లు, రీఫండ్స్ అన్నీ సీనియర్ ఆఫీసర్ల ఆమోదం కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇది డిలేలకు కారణమయ్యేది. ఇప్పుడు, ఈ బాధ్యతలను అసిస్టెంట్ PF కమిషనర్లు, లోయర్ ర్యాంక్ ఆఫీసర్లకు డెలిగేట్ చేశారు. దీనివల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్ తగ్గడమే కాకుండా, ఫీల్డ్ ఆఫీస్‌లలో ఎక్కువ అకౌంటబిలిటీని తెచ్చింది. దీంతో సభ్యులు ఇప్పుడు తమ సర్వీసులను వేగంగా, పారదర్శకంగా, సంతృప్తిగా పొందవచ్చు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 10:24 AM