RBI Ban Rent Payment: ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్‌తో అద్దె చెల్లింపులకు గుడ్‌బై..ఆర్బీఐ కొత్త రూల్స్
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:06 AM
క్రెడ్ లేదా పేటీఎం, ఫోన్‌పే ద్వారా అద్దె చెల్లించే వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపులను ఈ యాప్స్ నిలిపివేశాయి. అయితే ఎందకు ఈ నిర్ణయం తీసుకున్నాయి, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు ఫోన్‌పే, క్రెడ్ లేదా పేటీఎం యాప్‌లతో క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లిస్తున్నారా? అయితే, ఇది మీకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్‌లు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపులను నిలిపివేశాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఏం జరిగింది?
ఆర్బీఐ కొత్తగా పేమెంట్ అగ్రిగేటర్ రూల్స్ జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం ఫోన్‌పే, క్రెడ్, పేటీఎం వంటి యాప్‌లు తమ ప్లాట్‌ఫామ్‌లలో అద్దె చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడానికి ముందు, ఆయా ఓనర్ల KYC (Know Your Customer) వెరిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ల్యాండ్‌లార్డ్‌ల KYC గుర్తింపు వివరాలను సేకరించి, వాటిని వెరిఫై చేయడం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న, క్లిష్టమైన ప్రాసెస్. అందుకే, ఈ యాప్‌లు వెంటనే క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపులను ఆపేశాయి.
నిజంగానే ఈ సర్వీస్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కొత్త రూల్స్ వచ్చిన రెండు రోజుల్లోనే ఈ యాప్‌లు సర్వీస్‌ను సస్పెండ్ చేశాయి. అయినా, ఈ రూల్స్ పాటించడానికి ఈ ఏడాది చివరి వరకు టైమ్ ఉన్నా, రెగ్యులేటరీ ప్రెజర్ వల్ల వెంటనే యాక్షన్ తీసుకున్నాయని ఓ నివేదిక తెలిపింది.
ఎందుకు ముఖ్యం?
ఫోన్‌పే, క్రెడ్, పేటీఎం వంటి యాప్‌లు అద్దె చెల్లింపులకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను ఆఫర్ చేయడంలో ముందుండేవి. ముఖ్యంగా క్రెడ్, ఫోన్‌పేలు ఈ సర్వీస్‌లో టాప్‌లో ఉన్నాయి. క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే, యూజర్లకు రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ సర్వీస్ ఆగిపోవడంతో చాలా మంది యూజర్లు నిరాశ చెందుతున్నారు. అంతేకాదు నోబ్రోకర్, హౌసింగ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లు కూడా త్వరలో ఈ సర్వీస్‌ను నిలిపివేయొచ్చని సమాచారం.
ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించలేకపోతే, ఇతర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, UPI, లేదా నేరుగా క్యాష్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది. కానీ, ఈ ఆప్షన్స్‌లో క్రెడిట్ కార్డ్‌లాంటి రివార్డ్స్ రావు. కొన్ని యాప్‌లు ఈ రూల్స్‌కి అనుగుణంగా KYC ప్రాసెస్‌ని స్ట్రీమ్‌లైన్ చేసి, మళ్లీ సర్వీస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు.
ఈ రూల్స్ ఎందుకు వచ్చాయి?
ఆర్బీఐ ఈ కొత్త రూల్స్ తెచ్చింది ఎందుకంటే, పేమెంట్ అగ్రిగేటర్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్‌లో ట్రాన్స్‌పరెన్సీ, సెక్యూరిటీ పెంచడానికి. అద్దె ఓనర్ల KYC చేయడం వల్ల, ఎవరికి పేమెంట్స్ వెళ్తున్నాయో స్పష్టత తెలుస్తుంది. ఇది ఫ్రాడ్‌ని తగ్గించడానికి, డబ్బు లావాదేవీలను రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ, ఈ ప్రాసెస్ యాప్‌లకు ఖర్చుతో కూడుకున్నది, టైమ్ తీసుకునే పని. అందుకే, వాళ్లు వెంటనే సర్వీస్‌ని ఆపేశారు. ఈ యాప్స్ ద్వారా రెంట్ పేరుతో అనేక మందికి మనీ ట్రాన్స్ ఫర్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి