Share News

Supreme Court: పైలట్ల తప్పిదం ఉందనడం బాధ్యతారాహిత్యం.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 03:04 PM

ప్రమాదానికి కారణం పైలట్ల తప్పిదమేనని విచారణ పూర్తి కాకుండానే ఊహాగానాలు వ్యాప్తి చేయడం తగదని న్యాయమూర్తులు సూర్య కాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Supreme Court: పైలట్ల తప్పిదం ఉందనడం బాధ్యతారాహిత్యం.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Air India flight crash

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్టు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొంది.


నివేదికపై ఊహాజనిత కథనాలు రావడం బాధ్యతారాహిత్యమేనని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదానికి కారణం పైలట్ల తప్పిదమేనని విచారణ పూర్తి కాకుండానే ఊహాగానాలు వ్యాప్తి చేయడం తగదని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు నోటీసులిచ్చింది.


ఈ ఏడాది జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 (బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్) కొద్ది సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలింది. విమానంలోని 241 మందితో పాటు మెడికల్ కాలేజీ మీద పడటంతో మరో 19 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఏఏఐబీ ప్రాథమిక నివేదక బయటపెట్టింది. ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయినట్టు నివేదికలో పేర్కొంది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించాడని, నేను ఆపలేదని మరో పైలట్ సమాధానమిచ్చాడని తెలిపింది. ఈ క్రమంలో పైలటే ఇంధన స్విచ్‌ను షట్‌డౌన్ చేసినట్టు ఊహాజనిత వార్తలు వెలువడ్డాయి.


ఇవి కూడా చదవండి..

సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..

విజయ్ ర్యాలీకి వచ్చిన జనాల గురించి కమల్ హాసన్ కామెంట్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 03:34 PM