Share News

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

ABN , Publish Date - Mar 10 , 2025 | 05:41 PM

డీఆర్ఐ ఇంటరాగేషన్‌లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు.

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా (Gold Smulling) కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao)ను మార్చి 24 వరకూ జ్యుడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. డీఆర్ఐ కస్టడీ సోమవారంతో ముగుస్తుండటంతో ఆమెను బెంగళూరు ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనను ఇంటరాగేషన్ సమయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు మాటలతో వేధించారని, బెదిరింపులకు పాల్పడ్డారని కోర్టు ముందు రన్యారావు చెప్పారు. డీఆర్ఐ కస్టడీలో తాను తీవ్ర భావోద్వోగానికి గురయ్యానని, అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆపినప్పుడల్లా మాటలతో తనను వేధించారని కోర్టుకు తెలిపారు.

Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్


కంటతడి..

డీఆర్ఐ ఇంటరాగేషన్‌లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు. అయితే, రన్యారావు వాదనను డీఆర్ఐ తోసిపుచ్చింది. అరెస్టు, ఇంటరాగేషన్ సహా మొత్తం ప్రక్రియ సీసీటీవీలో రికార్డు అయినట్టు తెలిపింది.


రన్యారావు కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఇటీవల ఒక ఫోటో వైరల్ అయింది. దీంతో డీఆర్ఐ ఇంటరాగేషన్‌లో ఆమెపై దాడి జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే నిజమైతే ఇది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పుర్సన్ నాగలక్ష్మీ చౌదరి వ్యాఖ్యానించారు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకోగలమన్నారు. ఈ నేపథ్యంలో డీఆర్ఐ శారీరకంగా తనపై ఎలాంటి దాడి చేయలేదని కోర్టు ముందు రన్యారావు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.


24వరకూ జ్యుడిషియల్ కస్టడీ.. బెయిలుపై రేపు విచారణ

కాగా, రన్యారావును మార్చి 24వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ప్రత్యేక కోర్టు సోమవారంనాడు ఆదేశించింది. బెయిలు మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను మంగళవారంనాడు చేపట్టనుంది.


ఇవి కూడా చదవండి

MK Stalin: నోరు అదుపులో పెట్టుకోండి... కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్టాలిన్

NEP, Language Row: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. డీఎంకేపై ధర్మేంద్ర ప్రధాన్ ఎదురుదాడి

Digvijaya Singh: బీజేపీ కోవర్టులను ఎప్పుడు తప్పిస్తారు?.. రాహుల్‌కు డిగ్గీ ప్రశ్న

Ramdev Baba: అమెరికా 'టారిఫ్ టెర్రరిజం'... రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 10 , 2025 | 05:44 PM