Rajnath Singh: రెడ్ కారిడార్లు.. వృద్ధి కారిడార్లుగా
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:31 AM
మావోయిస్టుల ప్రాబల్యంతో ‘రెడ్ కారిడార్లు’గా ముద్రపడిన ప్రాంతాలు ఇప్పుడు ‘అభివృద్ధి కారిడార్లు’గా మారాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
పోలీసు అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి
న్యూఢిల్లీ, అక్టోబరు 21: మావోయిస్టుల ప్రాబల్యంతో ‘రెడ్ కారిడార్లు’గా ముద్రపడిన ప్రాంతాలు ఇప్పుడు ‘అభివృద్ధి కారిడార్లు’గా మారాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పోలీసు బలగాల అవిశ్రాంత కృషి కారణంగా ‘నక్సల్స్ హబ్స్’.. రహదారులు, పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులతో ‘ఎడ్యుకేషన్ హబ్స్’గా మారాయని చెప్పారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళులు అర్పించి ప్రసంగించారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్, బీఎ్‌సఎఫ్ సహా అన్ని పారామిలిటరీ బలగాలు, స్థానిక యంత్రాంగాల కృషి కారణంగానే మావోయిస్టు ఉగ్రవాదాన్ని 90శాతం నిర్మూలించగలిగామన్నారు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.