Share News

Constitution Club Elections: మోదీ-షా అభ్యర్థిని ఓడించిన సొంతపార్టీ నేత రాజీవి ప్రతాప్ రూఢీ

ABN , Publish Date - Aug 13 , 2025 | 06:58 PM

కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి ఘన విజయం సాధించారు.

Constitution Club Elections: మోదీ-షా అభ్యర్థిని ఓడించిన సొంతపార్టీ నేత రాజీవి ప్రతాప్ రూఢీ
Rajiv Pratap Rudy

న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో రాజీవ్ ప్రతాప్ రూడీకి 391 ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థి బీజేపీ నేత సంజీవ్ బాల్యన్‌కు 291 ఓట్లు వచ్చాయి. 100 ఓట్ల తేడాతో రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.


తాను విజయం సాధించిన సందర్భంగా ప్రతాప్ రూడీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను 100 కంటే ఎక్కువ ఓట్లతో గెలిచి ఉండొచ్చు. వీటిని 1000 మంది ఓటర్లతో గుణిస్తే.. ఆ సంఖ్య లక్షకు పెరుగుతుంది. ఇది నా ప్యానెల్ విజయం’ అని విజయ దరహాసం చిందించారు. రెండు దశాబ్దాలకు పైగా క్లబ్‌కు నాయకత్వం వహిస్తున్న రూడీకి 391 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి బాల్యాన్‌కు 291 ఓట్లు వచ్చాయి. క్లబ్‌లో 1,200 మంది సభ్యులు ఉండగా.. అందులో 707 మంది మాత్రమే తమ ఓటును వినియోగించుకున్నారు.rajeev pratap.jpeg


కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖల జాబితాలో ఉన్నారు.


బీజేపీ వర్సెస్ బీజేపీ పోరు.. కాంగ్రెస్ సపోర్ట్..

కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎందుకంటే.. ఈ పోటీ బీజేపీ వర్సెస్ బీజేపీగా నడిచింది. పోటీ చేసిన ఇద్దరూ బీజేపీ నేతలు కావడంతో ఎన్నిక ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగింది. ఇటు రాజీవ్ ప్రతాప్ రూడీ.. అటు సంజీవ్ బాల్యాన్.. ఇద్దరూ బీజేపీకి చెందిన కీలక నేతలే. వీరిద్దరూ కేంద్ర మంత్రులుగానూ పని చేశారు. ఈ క్రమంలో సీసీ ఎన్నికపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

అయితే, రూడీ విజయం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతల అండదండలతోనే రూడీ ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్లు హస్తినలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజీవ్ ప్రతాప్ రూడీ పార్లమెంట్ ఆవరణలో నిల్చుని ఉండగా.. అప్పుడే వచ్చిన రాహుల్ గాంధీ.. రూడీకి కంగ్రాట్స్ చెప్పడం కనిపిస్తోంది. షేక్ హ్యాండ్ ఇచ్చి.. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ వీడియో షేర్ చేసిన వారు.. ‘రాహుల్ గాంధీ.. ప్రతాప్ రూడీ వెనకుండి.. మోదీ-షా నిలబెట్టిన సంజీవ్ బాల్యాన్‌ను చిత్తుగా ఓడించారు. మోదీ-షా ద్వయానికి ఇది పెద్ద పరాజయం.’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

రూడీకి అండగా కాంగ్రెస్..!

వీడియో సంగతి అటుంచితే.. రాజీవ్ ప్రతాప్ రూడీకి కాంగ్రెస్ నాయకులు సపోర్ట్‌గా నిలిచి ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర హుడా.. రూడీకి మద్ధతుగా పరోక్ష సహకారం అందించారట. దీంతో రూడీకి వెన్నుదన్నుగా కాంగ్రెస్ నిలిచిందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఎంపీలు నిషికాంత్ దూబే, సీఎం రమేష్‌కు బాల్యాన్ తరఫున ప్రచారం చేశారు. దీంతో బాల్యాన్ వైపు బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారాలన్నింటినీ అభ్యర్థులిద్దరూ కొట్టిపారేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

For More National News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 11:33 AM