Indian Farmers: రైతులకు భారీ షాక్.. పెరగనున్న యూరియా ధరలు!
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:06 AM
ఇటీవల యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు మరో షాక్ తగలనుంది. రబీ సీజన్ ప్రారంభానికి ముందే దేశంలో యూరియా కొరత రానుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం..
చైనా ఎగుమతుల నిలిపివేతతో పెరగనున్న ఎరువుల ధరలు
యూరియా, డీఏపీ ఎరువుల్లో 95 శాతం చైనా నుంచే..
న్యూఢిల్లీ, అక్టోబరు 21: ఇటీవల యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు మరో షాక్ తగలనుంది. రబీ సీజన్ ప్రారంభానికి ముందే దేశంలో ఎరువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. యూరియాతో పాటు కొన్ని రకాల ఎరువుల ఎగుమతులను ఈ నెల 15 నుంచే చైనా నిలిపివేసింది. ఈ నిర్ణయం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నిలిపివేత 5 నుంచి 6 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం ఉపయోగించే టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్పేట్ (టీఎమ్‌ఏపీ), అడ్‌బ్లూతో పాటు యూరియా, డీఏపీ వంటి ఎరువులను దాదాపు 95 శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు చైనా ఆంక్షలతో వీటి ధరలు మరో 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. భారత్ ప్రతి సంవత్సరం 2.5 లక్షల టన్నుల ప్రత్యేక ఎరువులను వినియోగిస్తోంది. వీటిలో సుమారు 60-65 శాతం రబీ (అక్టోబరు నుంచి మార్చి) సీజన్‌లోనే వాడుతున్నారు. ఈ సమయంలో ధరలు పెరగితే రైతులపై మరింత భారం పడుతుంది. అయితే వ్యాపారులు ఇప్పటికే కొంత మేర ఎరువులను నిల్వచేయడంతో రబీ అవసరాలు తీరుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.