PM Modi: మేడ్ ఇన్ ఇండియా వస్తువులు.. దుకాణాల బయట స్వదేశీ బోర్డులు
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:46 PM
మనం ఏమి కొనుగోలు చేసినా, ఎక్కడ కొనుగోలు చేసినా 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనడం, కచ్చతంగా అవి దేశవాళీ వస్తువులయ్యే చూసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని మోదీ అన్నారు.
అహ్మదాబాద్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి 'స్వదేశీ' ఆవశ్యకతను ప్రస్తావించారు. వ్యాపారులు తమ దుకాణాల బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలని, స్వదేశీ వస్తువులు అమ్మాలని సూచించారు. వరుస పండుగల సీజన్‌ను వస్తుండటాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఈ సూచనలు చేశారు. అహ్మదాబాద్‌లో సోమవారంనాడు జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ, నవరాత్రి, విజయ దశమి (దసరా), ధన త్రయోదశి, దీపావళి వంటి వరుస పండుగలు మన ముందున్నాయని అన్నారు.
'పండుగలు మన సంప్రదాయ చిహ్నాలు. స్వయం సమృద్ధితో పండుగలు నిర్వహించుకోవాలి' అని ప్రధాని సూచించారు. మనం ఏమి కొనుగోలు చేసినా, ఎక్కడ కొనుగోలు చేసినా 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనడం, కచ్చతంగా అవి దేశవాళీ వస్తువులయ్యే చూసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలి' అని ప్రధాని అన్నారు. అమ్మకందారులు గర్వంగా నేను స్వదేశీ వస్తువులు అమ్ముతున్నాననని బోర్డులు ప్రదర్శించాలని సూచించారు.
ప్రధాన మంత్రి గత పదకొండేళ్లుగా 'వోకల్ ఫల్ లోకల్', మేక్ ఇన్ ఇండియా'కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న టారిఫ్‌ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఆందోళనలు తలెత్తుతున్న క్రమంలో స్వదేశీకి ప్రధాని పెద్దపీట వేస్తున్నారు. స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయడంలోనే దేశానికి నిజమైన సేవ ఉందని 'మన్ కీ బాత్' రేడియో షోలోనూ ప్రధాని ఇటీవల బలంగా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News