Priyanka Gandhi Signature Campaign: ఓటు దోపిడీకి చెక్ పెడదాం.. సంతకాల సేకరణ ప్రారంభించిన ప్రియాంకా గాంధీ
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:33 PM
కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఓటు హక్కు రక్షణ, ఓటు చోరీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల ఓటు విలువను కాపాడడమే లక్ష్యంగా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎంపీ ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే నిజమైన దేశభక్తి అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు రక్షణ కోసం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వోట్ చోరీపై సంతకాల సేకరణ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల హక్కులు, ప్రతి ఓటు విలువను కాపాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది.
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఉద్యమానికి నాయికత్వం వహిస్తూ, దేశ ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు (Priyanka Gandhi Signature Campaign). మీ ఓటు మాత్రమే కాదు, మీ సంతకం కూడా ఎంతో శక్తివంతం అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులపై పోరాడేందుకు ఇది ఒక ముందడుగని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు.
ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు విలువను రక్షించడం, భారత రాజ్యాంగం అమూల్యమైన విలువలను కాపాడటం. ప్రతి సంతకం ఓటే. ప్రతి ఓటు విలువైనదే. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రతి ఓటును రక్షించేందుకు మీరు కూడా మా ప్రచారంలో భాగం కావాలన్నారు.
మన రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడేదుకు మనం పోరాడుతున్నట్లు వీడియో ద్వారా చెప్పారు. మీరు అందరూ ఈ వోట్ చోరీ సంతకాల సేకరణ క్యాంపెయిన్‌లో పాల్గొనాలని, ప్రతి ఓటు లెక్కలోకి వస్తుందన్నారు. అలాగే ప్రతి సంతకమూ ముఖ్యమే. మీరు ప్రజాస్వామ్యం పట్ల మీ మద్దతు తెలియజేస్తే, అది ఎంతో బలమైన సంకేతం అవుతుందన్నారు.
ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓటర్లను తొలగించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని నిన్న ఆరోపించారు. ఓట్ల చోరీపై కర్ణాటక CID చేస్తున్న విచారణకు ఎలక్షన్ కమిషన్ సహకరించడం లేదన్నారు. కళబురిగి జిల్లాలోని అలండ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటర్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. ఇలా అనేక చోట్ల జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి