PM Modi: 28న పాంబన్‌కు ప్రధాని మోదీ.. కొత్త వంతెన ప్రారంభం
ABN , Publish Date - Feb 15 , 2025 | 07:28 AM
ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలు పుతూ సముద్రంపై రూ.550 కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకి తం చేయనున్నారు.
- ఏర్పాట్లు పరిశీలించిన దక్షిణ రైల్వే జీఎం
చెన్నై: ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలు పుతూ సముద్రంపై రూ.550 కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం, ధనుష్కోడి(Rameshwaram, Dhanushkodi) తదితర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. వంతెన ప్రారంభోత్సవ ప్రాంతంలో వేదిక నిర్మాణ పనులకు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: Amit Shah: 26న చెన్నై ఈషా కేంద్రానికి అమిత్ షా..

ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్(Southern Railway General Manager RN Singh) ఇతర అధికారులు పాంబన్ కొత్త వంతెనపై తుది విడత పరిశీలన, తనిఖీ నిర్వహించారు. ఈ రైలు వంతెనను ప్రధాని 28న ప్రారంభించనున్నారనే సమాచారం అందటంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర భద్రతా విభాగం ఉన్నతాధికారులు కూడా ఆ రైలు వంతెనను పరిశీలించారు. ఆ వంతెన మధ్యలో ఉన్న హైడ్రాలిక్ లిఫ్ట్‌ల పనితీరు కూడా తనిఖీ చేసి జీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
Read Latest Telangana News and National News