Share News

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా తొక్కిసలాటపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:12 PM

మహా కుంభమేళా తొక్కిసలాట ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. మరణించిన భక్తుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా తొక్కిసలాటపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటికే యూపీ సీఎంకు నాలుగు సార్లు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. దీంతోపాటు ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ''ప్రయాగ్‌రాజ్ ప్రమాదం చాలా బాధాకరం. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దీంతో పాటు గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించడంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి యోగి జీతో మాట్లాడాను, రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తున్నాను.''


భారత రాష్ట్రపతి..

మరోవైపు ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటన చాలా బాధాకరం. మరణించిన భక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులందరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.


యూపీ సీఎం ఏమన్నారంటే..

కుంభమేళా తొక్కిసలాటలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయితే మరణాల గురించి యూపీ ప్రభుత్వం ఇంకా ఏం చెప్పలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలుపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కూడా ఆయనతో మాట్లాడి పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో బుధవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో సంగం ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇందులో దాదాపు 10 మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు.


ఎలా జరిగిందంటే..

మౌని అమావాస్య సందర్భంగా అనేక మంది భక్తులు స్నానం చేయడానికి ఒకే చోటుకు వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 1 గంట నుంచి జనం స్నానానికి వెళ్ళాల్సిన మార్గం సామర్థ్యానికి మించి పెరిగింది. పోలీసు యంత్రాంగం వారిని ఘాట్‌కు తీసుకెళ్లి, గుర్తించబడిన బారికేడ్ల ద్వారా మాత్రమే వెనక్కి పంపాలని యోచిస్తోంది. కానీ జనసమూహం చాలా పెరగడంతో అదుపు చేయలేనిదిగా మారింది. ఆ క్రమంలో 1.45 నుంచి 2 గంటల మధ్య, ప్రజలు అదుపు తప్పి సంగం వైపు వెళ్ళడానికి బారికేడ్లను దాటి దూకడం ప్రారంభించారు. వారు దాటి దూకుతుండగా, అక్కడ నిద్రిస్తున్న కుటుంబాలపై పలువురు పడ్డారు. ఆ తరువాత చెక్క స్తంభం విరిగిపోయినప్పుడు తొక్కిసలాట జరిగింది.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 01:19 PM