President Droupadi Murmu: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం..
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:18 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణికి చెందిన సబ్‌మెరైన్‌లో ఆమె బయల్దేరారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu).. కర్ణాటకలోని కార్వార్(Karwar) నౌకాదళ స్థావరంలో జలాంతర్గామి విహారయాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కల్వరి తరగతి జలాంతర్గామి(Kalvari Class Submarine) అయిన ఐఎన్ఎస్ వాఘ్‌షీర్(INS Vaghsheer)లో ప్రయాణించి దీనికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయాణంలో రాష్ట్రపతితో పాటు నౌకదళ ప్రధాన అధికారి దినేశ్ కే.త్రిపాఠి(Chief of Naval Staff Admiral Dinesh K.Tripathi) కూడా ఉన్నారు.
త్రివిధ దళాలకు సుప్రీమ్ కమాండర్(Supreme Commander) అయిన రాష్ట్రపతి ముర్ము.. ఈ సబ్‌మెరైన్‌లో ప్రయాణించడం ఇదే తొలిసారి. అంతకంటే ముందు.. మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే.అబ్దుల్ కలామ్(Dr APJ Abdul Kalam) కల్వరి శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించారు.
ఇవీ చదవండి:
ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..