Mann Ki Baat: 2025వ సంవత్సరంలో భారతదేశ విజయాల్ని గుర్తుచేసుకున్న ప్రధాని
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:25 AM
ఆపరేషన్ సిందూర్ 2925లో భారత్ సాధించిన గొప్ప విజయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీనిని మారుతున్న భారతావనిగా అభివర్ణించిన ప్రధాని, సైనిక విజయాన్ని దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 28: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(ఆదివారం, డిసెంబర్ 28)న నిర్వహించిన ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 129వ మన్ కీ బాత్‌లో 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన విజయ క్షణాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌ను మారుతున్న భారతావనిగా అభివర్ణించి, సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రధాని ప్రశంసించారు.
ఈ ఏడాది భారత్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చూపిన ధైర్యం, స్వదేశీ ఆయుధాలు, టెక్నాలజీ ఉపయోగం ద్వారా సాధించిన విజయాలను మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపే నిర్ణయాన్ని చాటిందని, ఇది కేవలం సైనిక చర్య కాదు.. మారుతున్న భారత్ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
అంతేకాకుండా, గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరుగుదల, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. వోకల్ ఫర్ లోకల్‌ను మరింత బలోపేతం చేయాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..