PM Modi: ట్రంప్ మండిపడుతున్న వేళ.. పుతిన్‌కు మోదీ ఫోన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:06 PM
భారత్, రష్యా మైత్రిని అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ జీర్ణించుకోలేక పోతున్నారు. రష్యా నుంచి బారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయన మండిపడుతున్నారు. దీంతో భారత్‌పై ట్రంప్ సుంకాల మోత మోగించారు. అలాంటి వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 08: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంతో భారత్‌పై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. తన మాట వినడం లేదంటూ భారత్‌పై ఆయన ప్రతీకార సుంకాలను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. అలాంటి వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. భారత్‌లో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని రష్యా దేశాధ్యక్షుడు పుతిన్‌ను మోదీ కోరారు.
దీంతో భారత్, రష్యా దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంపై వీరిరువురు చర్చించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో తాజా పరిణామాలను ప్రధాని మోదీకి ఈ సందర్భంగా పుతిన్ వివరించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు ప్రధాని మోదీ సూచించారు. అలాగే ఈ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
వైసీపీ గూండాల దాడి.. పవన్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
For National News And Telugu News