Pawan Kumar: వైసీపీ గూండాల దాడి.. పవన్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:41 PM
వైసీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ ఆచూకీ ఎట్టకేలకు పోలీసులు కనుగున్నారు. అతడిని తిరుపతికి తీసుకు వచ్చారు. అనంతరం దాడి వివరాలు అడిగి అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
తిరుపతి, ఆగస్ట్ 08: వైసీపీ గూండాల చేత కిడ్నాపయిన పవన్ కుమార్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చిత్తూరులో పవన్‌ను శుక్రవారం పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని పోలీసులు తిరుపతికి తీసుకు వచ్చారు. ఇటీవల తిరుపతిలో వైసీపీ మూకల దాడిలో పవన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం అతడి ఆచూకీ లభ్యం కాలేదు. అదీకాక వైసీపీ గూండాలు.. పవన్‌పై దాడి చేసిన వీడియోలు వైరల్ అయినాయి. దీంతో అతడి తండ్రి జయరాజు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పవన్ కుమార్ అనే యువకుడు తీసుకున్న నగదు ఇవ్వ లేదనే కారణంగా అతడిని లాడ్జీలో కొందరు వ్యక్తులు బంధించారు. అనంతరం దుడ్డు కర్రలు, పైబర్ లాఠీలతో అతడిపై దాడి చేస్తూ చిత్రహింసలకు గురి చేశారు. అయితే పవన్ కుమార్‌పై దాడి చేసినది వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ అనుచరులని తెలుస్తోంది. ఇక పవన్‌పై లాఠీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి అభినయ్ అనుచరులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేశారు.
అలాగే ఈ వీడియోను.. పవన్ కుమార్ తల్లిదండ్రులకు సైతం పంపారు. మరోవైపు.. ఈ దాడి ఘటన అనంతరం పవన్ ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ క్రమంలో పవన్ కుమార్ ఆచూకీని చిత్తూరులో పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News