Chennai News: ప్రధాని పర్యటన రద్దు
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:01 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్ర పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈ నెల 26న ప్రధాని మోదీ తిరువణ్ణామలై, చిదంబరం ఆలయాలను దర్శిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, చిదంబరం నటరాజ ఆలయం నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయి.
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తమిళనాడు రాష్ట్ర పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈ నెల 26న ప్రధాని మోదీ తిరువణ్ణామలై, చిదంబరం ఆలయాలను దర్శిస్తారని బీజేపీ(BJP) వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, చిదంబరం నటరాజ ఆలయం నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయి.
ఈ క్రమంలో, ప్రధాని విదేశీ పర్యటన, పార్లమెంటు సమావేశాల కారణంగా ఈ నెల 26న రాష్ట్ర పర్యటన రద్దయినట్లు తెలిసింది. అక్టోబరు మొదటి వారంలో ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. జూలైలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ, ఆధునికీకరించిన తూత్తుకుడి విమానాశ్రయాన్ని ప్రారంభించి, పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News