RSS Centenary Celebrations: చొరబాటుదారులతో దేశానికి ముప్పు: ప్రధాని మోదీ..
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:44 PM
బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 01: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారతదేశానికి చొరబాటుదారుల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వల్ల అంతర్గత భద్రతతోపాటు మత సామరస్యం ఆపదలో పడే అవకాశం ఉందన్నారు. బుధవారం న్యూఢిల్లీలో బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.100 నాణెంతోపాటు పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ కాదని.. వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం కోసం పాటు పడే శక్తి అని అభివర్ణించారు. నేను అనే అహాన్ని వీడి.. మనం అనే సామూహిక భావన వైపు నడిపించే ప్రయాణమే ఆర్ఎస్ఎస్ అని వివరించారు. ఆర్ఎస్ఎస్‌కు అనేక అనుబంధ సంస్థలు ఉన్నా.. వాటి అంతిమ లక్ష్యం ఒక్కటేనని.. జాతీయతే అగ్రస్థానమని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఈ అనుబంధ సంస్థల మధ్య వైరుధ్యాలు ఉండవని పేర్కొన్నారు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దేశ నిర్మాణంతోపాటు స్వాతంత్ర్య పోరాటం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఇక స్వాతంత్ర్యం అనంతరం ఆర్ఎస్ఎస్‌పై అనేక దాడులు జరిగాయని.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడిందని ప్రధాని మోదీ తెలిపారు.
మరోవైపు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భందా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులను చొరబాటుదారుల నుంచి రక్షించేందుకే డెమెగ్రఫిక్ మిషన్ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
అదీకాక వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఓట్ల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చోరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ గతంలో విమర్శించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
జగన్ ఓటమితో ఏపీకి స్వాతంత్ర్యం వచ్చింది..
For More National News And Telugu News