PM Modi: స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయండి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 20 , 2025 | 10:33 AM
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 140 కోట్ల భారతీయులకు ఆయన కీలక సూచన చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలంటూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా 140 కోట్ల మంది భారతీయుల కష్టపడే తత్వానికి, సృజనాత్మకత, ఆవిష్కరణలకు తోడ్పాటును అందించాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూచించారు. భారతీయ ఉత్పత్తులను కొనగోలు చేసి..గర్వ్ సే కహో యే స్వదేశీ హై అని చెప్పుకుందామని చెప్పారు. పండగ సీజన్‌లో కొనుగోలు చేసిన వస్తువులను సోషల్ మీడియాలో పంచుకోవాలంటూ పౌరులకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మీరు కొన్న వాటిని కూడా షేర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల.. ఇతరులకు ఇది ప్రేరణగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీపావళి పర్వదినం పురస్కరించుకుని సోమవారం దేశ ప్రజలకు ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప రాష్ట్రపతి తదితరులు దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు
For More National News And Telugu News