Share News

PM Modi Christmas 2025: ఢిల్లీ కేథడ్రల్ చర్చ్‌ క్రిస్మస్ ఉదయ సర్వీస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:43 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఉదయపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, యేసు క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

PM Modi Christmas 2025: ఢిల్లీ కేథడ్రల్ చర్చ్‌ క్రిస్మస్ ఉదయ సర్వీస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ
PM Modi Christmas 2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: నేడు క్రిస్మస్ (డిసెంబర్ 25) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో ఉదయపు ప్రార్థనా సర్వీస్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ, ఉత్తర భారత క్రైస్తవ సమాజం పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో ప్రార్థనలు, సాంప్రదాయ క్యారల్స్, హిమ్స్‌లతో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ బిషప్ ఆర్‌టి. రెవ. డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధానికి ప్రత్యేక ప్రార్థన చేశారు.

PM-Modi.jpg

ఈ సందర్భంగా ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేస్తూ, 'ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో క్రిస్మస్ ఉదయ సర్వీస్‌లో పాల్గొన్నాను. ఈ సర్వీస్ ప్రేమ, శాంతి, కరుణ యొక్క శాశ్వత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, మంచితనాన్ని ప్రేరేపించాలి' అని తెలిపారు. దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, ఈ పండుగ స్ఫూర్తి సమాజంలో ఐక్యతను బలోపేతం చేయాలని కోరారు.


యేసు క్రీస్తు బోధనలైన ప్రేమ, శాంతి, కరుణలను జ్ఞాపకం చేస్తూ, సమాజంలో సామరస్యం, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత వైవిధ్యభరిత మత సంప్రదాయాలకు గౌరవం చూపుతూ ఈ వేడుకలు జరిగాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని మోదీ క్రైస్తవ సమాజ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. 2023లో ఈస్టర్ సందర్భంగా సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్‌లో నిర్వహించిన ప్రార్థనకు మోదీ హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 25 , 2025 | 12:05 PM