PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:46 PM
ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలన్నారు.
నవీ ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీటుగా స్పందించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. విదేశీ ఒత్తిడులకు తలొగ్గిందని విమర్శించారు. ఉగ్రదాడి అనంతరం సైనిక చర్యను అడ్డుకుంటూ ఆనాడు నిర్ణయం తీసుకున్నదెవరో చెప్పాలని కాంగ్రెస్‌ను నిలదీశారు మోదీ. నవీ ముంబై అంతర్జాతీయ విమాశ్రయం ఫేజ్-1ను మోదీ బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లో ముంబై ఒకటి కావడంతోనే ఉగ్రవాదులు దానిపై దాడి చేశారన్నారు.
ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలని, దేశ ప్రజలకు ఈ విషయం తెలియాలని అన్నారు. కాంగ్రెస్ చూపించిన బలహీనతే ఉగ్రవాదులకు బలంగా మారిందన్నారు. జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడిందని ఆక్షేపించారు.
మాకు జాతీయ భద్రతే ముఖ్యం
తమ ప్రభుత్వానికి దేశం, దేశ పౌరుల భద్రతే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మిలటరీ యాక్షన్ చేపట్టామని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై తమ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ
సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్..
Read Latest Telangana News and National News