Share News

PM Kisan 21st Installment Date: పీఎమ్-కిసాన్ 21వ విడత నిధుల విడుదల ఎప్పుడు? పూర్తి వివరాలివే..

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:54 PM

భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తున్నారు.

PM Kisan 21st Installment Date: పీఎమ్-కిసాన్ 21వ విడత నిధుల విడుదల ఎప్పుడు? పూర్తి వివరాలివే..
PM Kisan 21st installment date

భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ మొత్తం 20 వాయిదాల్లో నిధులను రైతులకు అందించారు. ఇప్పుడు 21వ విడత వంతు వచ్చింది. మరి, ఈ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి (PM Kisan Rs. 2000 credit date).


పీఎమ్-కిసాన్ 20వ విడత నిధులు ఆగస్టు 2న విడుదలయ్యాయి. 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుతం లక్షలాది మంది రైతులు 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లోని రైతులు ఇప్పటికే 21వ విడత నిధులు అందుకున్నారు. ఈ రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రైతులకు గణనీయమైన నష్టం వాటిల్లింది. వారిని ఆదుకునేందుకు కేంద్రం సెప్టెంబర్ 26న.. 27 లక్షల మందికి పైగా రైతులకు 21వ విడత నిధులను అందజేసింది (PM Kisan next installment).


దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు దీపావళికి ముందే 21వ విడత విడుదల చేయవచ్చని అనేక మీడియా సంస్థలు పేర్కొన్నాయి (PM Kisan Diwali installment). అక్టోబర్ 18వ తేదీన పీఎమ్-కిసాన్ 21వ విడుత నిధులు విడుదలవుతాయని ఊహించాయి. అయితే ఆ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల తేదీని వారం రోజుల ముందు ప్రకటిస్తుంది. ఇప్పటివరకు ప్రకటన లేకపోవడంతో దీపావళికి ముందు నిధుల విడుదల ఉండదని చాలా మంది అనుమానిస్తున్నారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో పీఎమ్-కిసాన్ 21వ విడుత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు

బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2025 | 04:08 PM