Non Veg Banned: ప్రపంచంలో మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే.. ఎక్కడ ఉందంటే?
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:18 PM
కొందరు మాత్రం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మనుషులు ఉండటం సహజం. అయితే ఓ నగరంలో మాత్రం నాన్ వెజ్ ను నిషేధించారు. అందుకే ప్రపంంచలోనే మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరంగా ఆ సిటీ రికార్డు సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: నేటికాలంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే కొందరు మాత్రం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మనుషులు ఉండటం సహజం. అయితే ఓ నగరంలో మాత్రం నాన్ వెజ్ ను నిషేధించారు. అందుకే ప్రపంంచలోనే మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరంగా ఆ సిటీ రికార్డు సృష్టించింది. మరి.. ఆ నగరం ఏమిటి, అది ఎక్కడ ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జైనమతం బోధించే వాటిల్లో ప్రధాన సూత్రం 'అహింస' అనే విషయం తెలిసిందే. ఏ జీవికి హాని కలిగించకూడదని జైన మతం చెబుతుంది. 2014లో, జైన సన్యాసుల అభ్యర్థనలను అనుసరించి, గుజరాత్ సర్కార్ పాలిటానా పట్టణాన్ని(World Vegetarian City) 'మాంసం లేని నగరం'గా ప్రకటించింది. దీని ప్రకారం.. మాంసం, చేపలు , గుడ్ల అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది. పూర్తిగా శాఖాహార నగరంగా ప్రకటించిన పాలిటానాలో ఎటువంటి కబేళాలు లేదా, నాన్ వెజ్ రెస్టారెంట్లు ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులు పాలిటానా నగరం(Jain Temple Town)లోకి నాన్ వెజ్ తీసుకు రావడం కూడా చట్ట రీత్యా నేరం. ఇక్కడ చాలా మంది జైనులు పాలు, పాల ఉత్పత్తులను కూడా తినరు.
భారతదేశంలోని ఇతర ఆధ్యాత్మిక( Religious Tourism) నగరాలు మతపరమైన ఆచారాల కారణంగా మాంసం, మద్యం నిషేధించగా, పాలిటానాలో మాత్రం కేవలం మాంసాహార ఆహారాన్ని మాత్రమే చట్టం నిషేదించారు. అందుకే ఇది నాన్‌వెజ్‌ను నిషేదించిన ఏకైక నగరంగా మారింది. పాలిటానా జనాభా సుమారు 65,000 ఉంది. జనాభాలో 60% జైనులు, 35% హిందూ, 5% ముస్లిం, ఇతర వర్గాలు ఉన్నారు. ఈ నగరంలో నివసించే ముస్లింలు కూడా నాన్ వెజ్ నిషేధాన్ని పాటిస్తారు. ఈ నగర ఆర్థిక వ్యవస్థ పర్యాటకం(Tourism)పై వృద్ధి చెందుతుంది. ఏటా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఆలయ నిర్వహణ కార్యకలాపాలు, హోటళ్ళు, ధర్మశాలల ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
BJP State President: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది..
Chief Minister Sidda Ramaiah: సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..