Share News

India vs Pakistan: భారత్‌కు పాకిస్థానీ సపోర్ట్.. తప్పు తమ దేశానిదే అంటూ..

ABN , Publish Date - May 14 , 2025 | 12:33 PM

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆ తర్వాత మనపై దాడులకు తెగబడిన పాకిస్థాన్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించింది. మిసైల్స్, డ్రోన్ అటాక్స్‌తో శత్రుదేశ మిలటరీ పోస్ట్‌లు, ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది.

India vs Pakistan: భారత్‌కు పాకిస్థానీ సపోర్ట్.. తప్పు తమ దేశానిదే అంటూ..
Operation Sindoor

పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆ తర్వాత డ్రోన్లు, మిసైల్స్‌తో రెచ్చగొట్టిన పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. శత్రుదేశ క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే కూల్చేయడమే గాక మిలటరీ పోస్టులు, ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన పాక్.. భారత్‌ను సీజ్‌ఫైర్‌కు ఒప్పుకోవాలని కోరింది. ఆ తర్వాత తామే గెలిచామంటూ బీరాలు పోయింది. తప్పంతా ఇండియాదేనని.. తమది శాంతిని కోరుకునే దేశమంటూ సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. అయితే నిజం ఎంత దాచినా దాగదని అంటారు. ఓ పాక్ పౌరుడు తమ దేశం చేసిన పనిని సోషల్ మీడియాలో ఎండగట్టాడు. భారత్‌కు అతడు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. తప్పంతా తమ దేశానిదేనని అన్నాడు.


ప్రతీకారం మాత్రమే..

పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై దాడి చేసేందుకు భారత్‌కు పూర్తి హక్కు ఉందని అభయ్ అనే ఓ పాక్ పౌరుడు చెప్పాడు. తొలుత ఇండియాపై పాక్ దాడి చేసిందని, ఆ తర్వాత భారత్ అటాక్ చేయడంతో మాట మార్చిందన్నాడు. శాంతి, మానవ హక్కుల పేరుతో హడావుడి చేసిందన్నాడు. పహల్గాంలో అమాయక పర్యాటకుల్ని పాక్ పొట్టనబెట్టుకుందని మండిపడ్డాడు. ఇరు దేశాలు యుద్ధం కోరుకోవడం లేదన్నాడు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తప్పించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదన్నాడు అభయ్. బోధనలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు ఆ పాకిస్థానీ. భారత్ ఎప్పుడూ యుద్ధం మొదలుపెట్టదని.. అవతలి వాళ్లు అది కోరుకుంటే మాత్రం మర్చిపోలేని రీతిలో జవాబు ఇస్తుందన్నాడు. అయినా ఇది వార్ కాదని.. పహల్గాం దాడులకు ప్రతీకారం తీర్చుకోవడమేనని వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్స్.. సొంత పౌరుడే పాక్ పరువు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. వైభవ్‌కు ఉన్న పరిపక్వత పాక్ సైన్యం, నేతలకు లేదని మండిపడుతున్నారు.


అంతా గోబెల్స్

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే తరుణంలో పాక్ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని ఆ దేశ పౌరులే తిప్పికొడుతున్నారు. ఇండియా దాడులకు చేతులెత్తేయడమే గాక గెలిచామంటూ అబద్ధపు ప్రచారాలు చేసుకోవడానికి సిగ్గు లేదా అని నిలదీస్తున్నారు. భారత్ ఆధారాలతో సహా ఆపరేషన్ సిందూర్‌ గురించి వివరిస్తుంటే.. తామే నెగ్గాం, కావాలంటే సోషల్ మీడియా వీడియోలు చూసుకోమంటూ ప్రపంచం ముందు దేశం పరువు ఎందుకు తీస్తున్నారంటూ పాక్ ఆర్మీ, ప్రధానిపై విరుచుకుపడుతున్నారు.


ఇవీ చదవండి:

పాక్‌పై చైనా గుర్రు

కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే

బీజేపీలో చేరిన జకియా ఖానమ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 01:55 PM