Share News

India Vs Pakistan: ఆత్మాహుతి దాడి.. పాకిస్థాన్ ఆరోపణలు ఖండించిన భారత్

ABN , Publish Date - Jun 29 , 2025 | 08:57 AM

పాకిస్థాన్‌లో సైనికుల వాహనమే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది సైనికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్‌ ఆరోపణలు చేసింది. దీనిపై భారత్ స్పందించింది.

India Vs Pakistan: ఆత్మాహుతి దాడి.. పాకిస్థాన్ ఆరోపణలు ఖండించిన భారత్
MEA spokesperson Randhir Jaiswal

న్యూఢిల్లీ, జూన్ 29: పాకిస్థాన్‌లో సైనికుల వాహనమే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు మరణించారు. ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. పాక్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం వెల్లడించారు.

శనివారం(జూన్ 28న) నాడు ఉత్తర వజీరిస్థాన్‌ జిల్లాలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో సైనికుల వాహనం వైపునకు ఒక వ్యక్తి వేగంగా దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది ఆర్మీ సిబ్బందితోపాటు 19 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు.


pakistan-attack.jpg

శుక్రవారం అంటే.. జూన్ 27న దక్షిణ వజీరిస్థాన్‌లో నిఘా వర్గాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు 11 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటన జరిగిన మరునాడే ఈ ఆత్మహుతి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో భారత్ పై పాక్ ఆరోపణలు గుప్పించింది. ఆ దాడికి భారతదేశమే కారణమంది. అయితే, గంటల వ్యవవధిలోనే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌నకు చెందిన ఉసూద్ అల్ హర్బ్ ప్రకటించారు. దీంతో పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడినట్లు అయ్యింది. కాగా, పాక్ ఆరోపణలు భారత్ తీవ్రంగా ఖండించింది.


2021లో ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుగా ఉన్న పాకిస్థాన్ ప్రాంతంలో హింస బాగా పెచ్చురిల్లింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ పలు ఆరోపణలను గుప్పించింది. ఈ ఆరోపణలను ఆప్ఘాన్ ఖండించింది. అదీకాక.. ఈ ఏడాది బెలూచిస్థాన్, ఖైబర్ పఖ్త్ంఖ్వ ప్రాంతంలో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మధ్య జరుగుతున్న పోరులో 290 మంది మృతి చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లడ్డూ కల్తీ కుట్ర ఎవరిది ..?

భారీ వర్షాలు.. 9 మంది గల్లంతు

For More National News And Telugu News

Updated Date - Jun 29 , 2025 | 11:06 AM