Pakistan Cyber Attacks: భారత రక్షణ విభాగం వెబ్‌సైట్లపై పాక్ సైబర్ దాడులు
ABN , Publish Date - May 05 , 2025 | 05:51 PM
పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ తన 'ఎక్స్' హ్యాండిల్‌లో ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి వెబ్‌పేజీ ఇమేజ్‌లను పోస్ట్ చేసింది. అందులో ఇండియన్ ట్యాంక్ ఫోటోకు బదులు పాక్ ట్యాంక్ ఫోటోను రీప్లేస్ చేసింది. మరో పోస్ట్‌లో భారత రక్షణ సిబ్బంది పేర్ల లిస్ట్ ఉంది.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. భారత్‌పై సైబర్ దాడులకు తెగబడుతున్నారు. మరీ ప్రధానంగా భారత రక్షణ విభాగానికి చెందిన వెబ్‌సైట్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమై సమాచారం, లాగిన్‌లు టార్గెట్‌గా పాక్ సైబర్ దాడి జరుపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీర్ అండ్ అనాలసిస్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేసినట్టు 'పాకిస్థాన్ సైబర్ ఫోర్స్' అనే సైబర్ గ్రూప్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించుకుంది.
Putin vows full support to India: భారత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ 'ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్' వెబ్‌సైట్‌ను రూపుమార్చేందుకు (deface) కూడా ఈ గ్రూపు ప్రయత్నించినట్టు ఢిఫెన్స్ వర్గాల సమాచారం. హ్యాకింగ్ ప్రయత్నం వల్ల ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది అంచనా వేయడానికి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను పూర్తి ఆడిట్ కోసం ఆఫ్‌లైన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. పాక్‌తో సంబంధం ఉన్న, స్పాన్సర్ దాడులను గుర్తించేందుకు సైబర్ స్పేస్‌పై నిపుణులు కన్నేసి ఉంచారని, సైబర్ స్పేస్‌లోకి చొరబడకుండా భద్రతను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
10 జీబీ డాటా చేజిక్కించుకున్నాం..
పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ తన 'ఎక్స్' హ్యాండిల్‌లో ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి వెబ్‌పేజీ ఇమేజ్‌లను పోస్ట్ చేసింది. అందులో ఇండియన్ ట్యాంక్ ఫోటోకు బదులు పాక్ ట్యాంక్ ఫోటోను రీప్లేస్ చేసింది. మరో పోస్ట్‌లో భారత రక్షణ సిబ్బంది పేర్ల లిస్ట్ ఉంది. ''హ్యాక్డ్. సెక్యూరిటీ అనేది మీ భ్రమ. ఎంఈఎస్ డాటా సొంతమైంది'' అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్‌సైట్‌లోని 1,600 యూజర్లకు చెందిన 10 జీబీ డాటాను యాక్సిస్ చేసినట్టు కూడా క్లెయిమ్ చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !
For National News And Telugu News