Putin vows full support to India: భారత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..
ABN , Publish Date - May 05 , 2025 | 03:35 PM
ప్రధాని మోదీతో ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంలో ప్రధాని మాటలతో పూర్తిగా ఏకీభవించిన పుతిన్, ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు అన్నివిధాల సహాయకారిగా

Putin vows full support to India: ఉగ్రమూకలను పెంచిపోషిస్తూ పాక్ చేస్తున్న నీచపు పనులను మన ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సవివరంగా వివరించారు. ఇటీవల జరిగిన పహల్గాం దురాగతానికి సంబంధించి కీలకమైన విషయాల్ని పుతిన్ కు మోదీ తెలియజేసినట్టు సమాచారం. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం అందిస్తున్న సహకారం గురించి, దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనర్థాల గురించి కూడా పుతిన్ కు ప్రధాని మోదీ వివరించారు.
ప్రధాని మోదీతో ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంలో ప్రధాని మాటలతో పూర్తిగా ఏకీభవించిన పుతిన్, ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు అన్నివిధాల సహాయకారిగా ఉంటామని, చారిత్రకమైన ఇరుదేశాల సంబంధ బాంధ్యవ్యాలు ఎప్పుడూ కొనసాగుతాయని కూడా పుతిన్ భారత్ కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన పుతిన్, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. దాడికి కారణమైన వారిని, వారి మద్దతుదారులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ నొక్కిచెప్పారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
“అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేసి భారతదేశంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణనష్టం పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ దారుణ దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన నొక్కి చెప్పారు” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో తెలిపారు.