Meenatai Thackeray Statue Defaced: ఉద్ధవ్ ఠాక్రే తల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసిన అగంతకులు
ABN , Publish Date - Sep 17 , 2025 | 07:23 PM
సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన శివాజీ పార్క్ వద్దకు చేరుకుని విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. శివాజీ పార్క్ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముంబై పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
ముంబై: దాదర్‌లోని శివాజీ పార్క్‌లో బుధవారం నాడు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భార్య ఉద్ధవ్ ఠాక్రే తల్లి మీనతాయి ఠాక్రే (Meenatai Thackeray) విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపవిత్రం చేశారు. దీంతో శివసేన (యూబీటీ) నేతలు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున విగ్రహంపై కలర్ స్ప్రే చేయడం ద్వారా విగ్రహ రూపురేఖలు మార్చేందుకు అగంతకులు ప్రయత్నించినట్టు పార్టీ స్థానిక సభ్యులు తెలిపారు. మీనాతాయి ఠాక్రే విగ్రహంపై కుంకుమ్ (Sindoor) విసిరేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోందని మాజీ మేయర్, యూబీటీ క్యాంప్ లీడర్ కిషోర్ పడ్నేకర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శివసైనికులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఎవరో ప్రయత్నించినట్టు ఉందని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన శివాజీ పార్క్ వద్దకు చేరుకుని విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. శివాజీ పార్క్ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముంబై పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్సీ మిలంద్ నార్వేకర్, పార్టీ సీనియర్ నేత దివాకర్ రౌతే, స్థానిక (మహిం నియోజకవర్గం) ఎమ్మెల్యే మహేశ్ సావంత్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే తదితరులు అక్కడికి చేరుకుని ఘటనను తీవ్రంగా ఖండించారు.
విచారణకు ఆదేశం
మీనతాయి ఠాక్రే విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోం మంత్రి యోగేష్ కదమ్ హామీ ఇచ్చారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మీనతాయి ఠాక్రే విగ్రహాన్ని అపవిత్రం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2006లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
క్యాంపస్‌లో విక్టరీ ర్యాలీలను నిషేధించిన ఢిల్లీ హైకోర్టు
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Read Latest National News and Telugu News