Share News

P Chidambaram : SCO టియాంజిన్ డిక్లరేషన్‌ అర్థం లేనిది..

ABN , Publish Date - Sep 03 , 2025 | 08:34 AM

షాంఘై సహకార సంస్థ టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ ఎంపీ చిదంబరం ఒక 'చెత్త' అన్నారు. ఈ డిక్లరేషన్ ఉగ్రవాదాన్ని, దాని అన్ని రూపాల్ని తీవ్రంగా ఖండించింది.. దానిపై పాకిస్తాన్ సంతకం చేసి ఆమోదించింది. అది ఆ ప్రకటన విలువను చూపిస్తుందని..

P Chidambaram :  SCO టియాంజిన్ డిక్లరేషన్‌ అర్థం లేనిది..
P Chidambaram

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పి చిదంబరం విమర్శించారు. దీనిని 'చెత్త' అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రపంచదేశాలు ఉగ్రవాద కారక, బాధిత దేశాల మధ్య తేడాను చూపించవని పాకిస్తాన్ సంతకం నిరూపిస్తుందని చిదంబరం అన్నారు.

'టియాంజిన్ డిక్లరేషన్ ఉగ్రవాదాన్ని, దాని అన్ని రూపాల్ని తీవ్రంగా ఖండించింది. దానిపై పాకిస్తాన్ సంతకం చేసి ఆమోదించింది. అది ఆ ప్రకటన విలువను చూపిస్తుంది' అని చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాలు ఉగ్రవాద కారక, బాధిత దేశాల మధ్య తేడాను గుర్తించలేకపోతే, ఇటువంటి అర్థరహిత ప్రకటనలపై సంతకం చేసి ఆమోదించబడతాయంటూ ఆయన విమర్శించారు.


ఇలా ఉండగా, చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ దేశాధినేతల 25వ సమావేశంలో మన ప్రధాని మోదీ ప్రసంగించారు. SCO ద్వారా పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భారతదేశ విధానాన్ని ప్రధానమంత్రి తెలియజెప్పారు. దేశ భద్రత, కనెక్టివిటీ, అవకాశం అనే మూడు స్తంభాల కింద మరింత మెరుగైన చర్య తీసుకోవాలని ప్రధాని సభ్యదేశాల్ని కోరారు.

ఉగ్రవాద నిర్మూలనకు దృఢమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆయన సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సభ్య దేశాలు సంఘీభావంగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ.. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని కోరారు. SCO సభ్య దేశాలు టియాంజిన్ ప్రకటనను ఆమోదించాయి. ఈ నేపథ్యంలోనే చిదంబరం టియాంజిన్ ప్రకటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 04:02 PM