Share News

NIRF Medical College Rankings: టాప్‌ 20లో మన వైద్య కళాశాల ఒక్కటీ లేదు

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:44 AM

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ

NIRF Medical College Rankings: టాప్‌ 20లో మన వైద్య కళాశాల ఒక్కటీ లేదు
NIRF Medical College Rankings

  • ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల జాబితాలో తెలుగు రాష్ట్రాల కాలేజీలకు దక్కని చోటు

  • నేటి నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌

న్యూఢిల్లీ, జూలై 20: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు అత్యుత్తమ వైద్య కళాశాలలను ఎంచుకుంటారు. నీట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలలకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకులు ఇస్తుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్-2024 ర్యాంకుల జాబితాలో టాప్‌-20లో తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క వైద్య కళాశాల కూడా లేకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇచ్చిన ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఏ మెడికల్‌ కాలేజీకీ చోటు దక్కలేదు. నీట్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతుంటారు. కానీ, ఉత్తమ వైద్య కళాశాలల విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలు వెనకబడిపోవడం శోచనీయం. ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ ర్యాంకుల్లో తొలి స్థానం ఢిల్లీ ఎయిమ్స్‌కు దక్కగా.. 20వ స్థానంలో చెన్నైలోని శ్రీరామచంద్ర కళాశాల నిలిచింది. టాప్‌ 20 వైద్య కళాశాలల్లో అత్యధికంగా తమిళనాడులోనే 6 ఉండడం విశేషం.

దేశంలోని టాప్‌-10 వైద్య కళాశాలలివే..

1. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌), ఢిల్లీ

2. పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(చండీగఢ్‌)

3. క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ), వెల్లూరు, తమిళనాడు

4. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్స్‌

(ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్), బెంగళూరు, కర్ణాటక

5. జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీజీ మెడికల్‌

ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మెర్‌), పుదుచ్చేరి

6. సంజయ్‌ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, యూపీ

7. బనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), ఉత్తరప్రదేశ్‌

8. అమృత విశ్వ వైద్య పీఠం, కోయంబత్తూరు, తమిళనాడు

9. కస్తూర్బా మెడికల్‌ కాలేజీ (కేఎంసీ), మణిపాల్‌, కర్ణాటక

10. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ గవర్నమెంట్‌ హాస్పిటల్‌, తమిళనాడు

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:44 AM