Tejashwi Yadav: సీఎం అభ్యర్థిపై ఎలాంటి గందరగోళం లేదు.. తేల్చిచెప్పిన తేజస్వి
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:38 PM
ఆర్జేడీ చేపట్టిన 'బిహార్ అధికార్ యాత్ర'ను తేజస్వి సోమవారంనాడు ప్రారంభించారు. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ఎలాంటి అనిశ్చితి కానీ, అనుమానాలు కానీ లేవని ఈ సందర్భంగా తెలిపారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో విపక్ష మహాకూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే దానిపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఆర్జేడీ చేపట్టిన 'బిహార్ అధికార్ యాత్ర' (Bihar Adhikar Yatra)ను తేజస్వి సోమవారంనాడు ప్రారంభించారు. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ఎలాంటి అనిశ్చితి కానీ, అనుమానాలు కానీ లేవని ఈ సందర్భంగా తెలిపారు. సరైన సమయంలో సీఎం అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుందన్నారు.
'బిహార్ ప్రజలే నిజమైన యజమానులు. వారే ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంటారు. ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారో ప్రజలనే అడగండి. మీకు సమాధానం దొరుకుతుంది' అని మీడియాతో మాట్లాడుతూ తేజస్వి చెప్పారు.
కాగా, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు తనకు సపోర్ట్ చేయాలని తేజస్వి గతవారంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'ఈసారి నేను మొత్తం 243 సీట్లలోనూ పోటీ చేస్తున్నాను. బోచాహాన్ నియోజకవర్గం కావచ్చు, ముజఫర్‌పూర్ కావచ్చు, తేజస్వి పోరాడతాడు. నా పేరుతో ఓటు వేయమని ప్రజలను కోరుతున్నాను. బీహార్‌ను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను నేను తీసుకుంటాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదాం' అని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఓట్లు కాదు, హృదయాలను దొంగిలించారు.. మోదీపై సీఎం ప్రశంసలు
మోదీ పుట్టినరోజున బిహార్‌లో చలో జీతే హై చిత్ర ప్రదర్శన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి