Chhattisgarh: లొంగిపోయేందుకు సిద్ధం.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ నక్సలైట్ ఏరియా కమిటీ లేఖ
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:46 PM
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకోవడం సానుకూల పరిణామమని, గరియాబంద్ ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మీడియా ద్వారా నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని ఎస్పీ తెలిపారు.
గరియాబంద్: ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారంనాడు పెద్దఎత్తున నక్సలైట్లు ఆయుధాలు విడిచి లొంగిపోయిన క్రమంలో గరియాబంద్ (Gariaband) జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ కూడా ఆ బాట పట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. ఆయుధాలు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ విషయాన్ని గరియాబంద్ ఎస్‌పీ నిఖిల్ రఛేఖా (Nikhil Rakhecha) ధ్రువకరించారు. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉదంతి కమిటి రాసిన లేఖను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకోవడం సానుకూల పరిణామమని, గరియాబంద్ ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మీడియా ద్వారా నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని ఎస్పీ తెలిపారు.
గోబ్రా, సీతానది, శక్తి సారన్‌గఢ్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో చురుకుగా ఉన్న మావోయిస్టులు వీలైనంత త్వరగా లొంగిపావాలని ఆయన కోరారు. ఏమాత్రం సంకోచం లేకుండా తనను నేరుగా సంప్రదించవచ్చని, ముందుగా లొంగిపోయే నక్సలైట్ల బాధ్యత పూర్తిగా తాము తీసుకుంటామని నిఖిల్ రఛేఖా అన్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లో ఉంది.. రాజ్‌నాథ్ వార్నింగ్
ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో భారీ అగ్నిప్రమాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి