Nitin Gadkari: నా మేథస్సు విలువ నెలకు రూ.200 కోట్లు, డబ్బుకు కొదవలేదు
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:15 PM
ఈ-20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై చర్చ జరుగుతుండగా కేంద్రమంత్రి గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్‌పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్‌పై చురుగ్గా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించింది.
నాగపూర్: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుండటం, ఈ చర్య ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మేధస్సు (Brain) విలువ నెలకు రూ.200 కోట్లు అని, ఆర్థిక ప్రయోజనాల కోసం దిగజారే ప్రసక్తే లేదని చెప్పారు. నాగపూర్‌లోని అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ముందుగా ఒక మాట చెప్పనీయండి. ఇదంతా సొంత సంపాదన కోసం చేయడం లేదు. నేను చెప్పకుంటే మీరు మరో రకంగా ఆలోచించవచ్చు. నాకు పుష్కలంగా ఆదాయం ఉంది. నా మెదడు విలువ.. నెలకు రూ.200 కోట్లు. నాకు డబ్బుల కొరత లేదు' అని అన్నారు. తన కుమారులకు తాను ఐడియాలు ఇస్తుంటానని, అవకతవకలకు ఎప్పుడూ పాల్పడేది లేదని స్పష్టం చేశారు.
ఈ-20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై చర్చ జరుగుతుండగా, గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్‌పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్‌పై చురుగ్గా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించింది.
పెయిడ్ క్యాంపెయిన్
కాగా, ఇదంతా తనపై జరుగుతున్న 'పెయిడ్ సోషల్ మీడియా క్యాంపెయిన్'గా గడ్కరి కొట్టివేశారు. సోషల్ మీడియా ప్రచారం పెయిడ్ ప్రచారమని.. ఇథనాల్‌కు వ్యతిరేకంగా, రాజకీయంగా తనను టార్గెట్ చేసేందుకు జరుగుతున్న ప్రచారమని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి