Share News

Mumbai Meera Road: అర్ధరాత్రి మహిళతో యువకుడి అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:35 PM

ముంబైలో అర్ధరాత్రి ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. డ్రగ్స్ సేవించిన వ్యక్తి.. సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు వచ్చి.. ఆమెను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mumbai Meera Road: అర్ధరాత్రి మహిళతో యువకుడి అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
Mumbai Meera Road

ఇంటర్నెట్ డెస్క్: మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు కామాంధులు అయితే అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనలో మహారాష్ట్రలోని ముంబై నగరంలో జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళను ఓ వ్యక్తి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. స్థానికులు వచ్చి.. ఆ మహిళను కాపాడారు. అంతేకాక దాడికి యత్నించిన సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(viral video)లో వైరల్ అవుతోంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..


ముంబై నగరంలోని మీరా రోడ్(Mumbai Meera Road) ప్రాంతంలోని నివాస స్థలంలో అర్ధరాత్రి సమయంలో మహిళ కేకలు వేయడం వినిపించింది. ఏమి జరిగిందో చూడటానికి చాలా మంది జనం అక్కడికి చేరుకున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తి.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేయగా.. ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, కాపాడాలంటూ కేకలు పెట్టింది. మరోవైపు మహిళపై సదరు వ్యక్తి దాడికి యత్నించాడు.


ఇక ఆమె కేకలు విన్న స్థానికులు.. తొలుత వారిద్దరు తెలిసిన వారని దగ్గరకు వెళ్లలేదు. చివరకు మహిళ(woman assaulted)పై దాడి జరుగుతున్నట్లు గమనించి.. వెళ్లి ఆమెను రక్షించారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అలానే ఈ వీడియో మీరా రోడ్ ప్రాంతంలో, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో మహిళల భద్రతా లోపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి
సిమ్‌ ఉన్న ఫోన్లోనే వాట్సాప్‌ లాగిన్‌

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 01:17 PM