Kidnap at Nalgonda: నల్గొండలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్.. అదే కారణం.!
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:57 AM
నల్గొండ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారు. ఇదే సమయంలో ఆమె నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయనను పోలీసులకు అప్పగించారు కిడ్నాపర్లు. అసలేం జరిగిందంటే...
నల్గొండ జిల్లా, నవంబర్ 30: తిప్పర్తి(Tipparthi) మండలం ఎల్లమ్మ గూడెం గ్రామ పంచాయతీలో ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారు(Sarpanch candidate's husband was kidnapped). ఆయన భార్యను నామినేషన్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.?
తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలకు(Local body Elections) సంబంధించి బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు ఎన్నికల అధికారులు. దీంతో ఆ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు మరో సర్పంచ్ అభ్యర్థి భర్త ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రణాళిక అమలులో భాగంగా మామిడి నాగమ్మ(Mamidi Nagamma) అనే మహిళను ఎన్నికల పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో.. ఆమె భర్త మామిడి యాదగిరి(Mamidi Yadagiri)ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కిడ్నాపర్లు యాదగిరికి మూత్రం తాగించి, చిత్రహింసలు పెట్టి చివరకు పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో యాదగిరి భార్య నామినేషన్ వేయడంతో కిడ్నాప్(Kidnap) ప్లాన్‌కు తెరపడినట్టయింది.
అయితే.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన సందీప్ రెడ్డి(Congress supporter Sandeep Reddy) అనే వ్యక్తి ఈ కిడ్నాప్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై స్థానిక మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి(Bhupal Reddy), భాస్కర్ రావు(Bhasakr Rao)లు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించారు.
ఇవీ చదవండి: