Mahua Moitra: అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:23 PM
అమిత్‌షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాయపూర్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.
స్థానికుడు ఒకరు చేసిన ఫిర్యాదుపై మనా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196, సెక్షన్ 197 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి ముందు పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. మహువా అసహ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇదే టీఎంసీ వైఖరా అని ప్రశ్నించింది. అయితే మహువా వ్యాఖ్యలపై టీఎంసీ అధికారికంగా స్పందించలేదు.
నదియా జిల్లాలో గత గరువారంనాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహువా మొయిత్రా పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన సరిహద్దులను కాపాడటానికి ఎవరూ లేకపోతే, వేరే దేశం నుంచి ప్రతి రోజూ ప్రజలు ప్రవేశిస్తుంటే, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులపై కన్నేయడంతోపాటు మన భూములను లాక్కుంటున్నారని మన దేశ పౌరులు ఫిర్యాదు చేస్తుంటే.. మొదట మీరు అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
రేపట్నించి మంచినీళ్లు కూడా ముట్టను.. మనోజ్ జారంగే హెచ్చరిక
రాహుల్ యాత్రకు మమత డుమ్మా .. స్పందించిన టీఏంసీ
For More National News And Telugu News