Adhir Ranjan Chowdhury Vs TMC: రాహుల్ యాత్రకు మమత డుమ్మా .. స్పందించిన టీఏంసీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:15 PM
బిహార్ వేదికగా రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్రలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకాకపోవడంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై టీఎంసీ స్పందించింది.
కోల్‌కతా, ఆగస్టు 31: బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొనక పోవడంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన విమర్శలుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఏంసీ) పార్టీ స్పందించింది. ఆదివారం కోల్‌కతాలో టీఏంసీ ఎంపీ కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. బిహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రా కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలనేది తమ పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాహుల్ యాత్రకు సీఎం మమతా బెనర్జీతోపాటు ఎంపీ అభిషేక్ బెనర్జీ మద్దతు సైతం ఉందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అందుకే తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతలను ఈ యాత్రకు ప్రతినిధులుగా పంపుతున్నారని వివరించారు. అయితే ఈ ఇద్దరు నేతల్లో బహరంపూర్ ఎంపీ యూసుఫ్ పఠాన్ ఉన్నారని తెలిపారు. ఇక గత లోక్ సభ ఎన్నికల్లో ఈ అధిర్ రంజన్ చౌదరిని యూసుఫ్ పఠాన్ ఓడించారని గుర్తు చేశారు. అందుకే ఈ వ్యవహారాన్ని ఇంతగా ప్రస్తావిస్తున్నారంటూ అధీర్ రంజన్ చౌదరిపై ఎంపీ కునాల్ ఘోష్ మండిపడ్డారు.
మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారీగా ఓట్ల చోరీ జరిగిందంటూ ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఆగస్టు 17వ తేదీన రాహుల్ గాంధీ..బిహార్‌లోని ససారంలో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 16 రోజుల పాటు బిహార్‌లోని వివిధ రాష్ట్రాల ద్వారా సాగి.. సెప్టెంబర్ 1వ తేదీన అంటే.. సోమవారం పాట్నాలో ముగియనుంది. ఈ ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు ఇండియా కూటమిలోని కీలక పార్టీలు నిర్ణయించాయి. ఈ ముగింపు సమావేశానికి టీఏంసీ ఎంపీలు ఇద్దరు హాజరుకానున్నారు.
అయితే రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్రలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ ఆ పార్టీ అగ్రనేతలు కానీ హాజరు కాలేదు. రాహుల్ చేపట్టిన ఈ యాత్రలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొంటే.. ఆయన ముందు ఆమె వెలవెలబోతుందంటూ అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అందుకే ఆమె రాహుల్ యాత్రకు హాజరు కాలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ముగింపు యాత్రలో టీఎంసీ నేతలు యూసఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విమానంలో ప్రయాణికులకు వింత అనుభవం.. సిబ్బందిపై ఫైర్
టేకాఫ్ అయిన వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం
For More National News And Telugu News