MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నాకు ఏం జరిగినా ఈడీ అధికారులదే బాధ్యత
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:54 AM
‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
- కోర్టులో చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి
బెంగళూరు: ‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి(MLA Veerendra pappy) పేర్కొన్నారు. అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
సిక్కింలో అరెస్టు చేసిన వీరేంద్రపప్బిను బెంగళూరుకు తీసుకువచ్చిన ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీ ముగిసిన మేరకు గురువారం కోరమంగళలోని 35వ సీసీహెచ్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే సందర్భంలోనే న్యాయమూర్తి గజాననభట్ ముందు నిందితుడు వీరేంద్ర పలు వ్యాఖ్యలు చేశారు. తాగేందుకు కొళాయి నీరు ఇచ్చారని గాలి వెలుతురు లేని గదిలో బంధించారని, కనీసం కిటికీ కూడా లేదన్నారు. ఫుడ్ పాయిజన్‌తో శ్వాస ఆడక ఇబ్బంది పడ్డానన్నారు.
కనీసం ఓ కుర్చీ లేదని ప్లాస్టిక్ కంటైనర్‌లో ఆహారం ఇస్తున్నారని తనకు ఏదైనా జరిగినా, తాను మృతిచెందినా అందుకు ఈడీ అధికారులే కారకులన్నారు. తనపట్ట నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇదే సందర్భంలోనే వీరేంద్ర తరుపు న్యాయవాదులు కనీస సౌకర్యాలు సమకూర్చాలని వాదించారు. పరిశీలిస్తామంటూ న్యాయమూర్తికి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News