Share News

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

ABN , Publish Date - Jun 24 , 2025 | 01:32 PM

రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్‌ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ తెలిపారు.

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

- రేపు వెళ్లి కలుస్తా: అళంద ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌

బెంగళూరు: రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఫోన్‌ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌(MLA BR Patil) తెలిపారు. కలబురగిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య తనకు ఆత్మీయ స్నేహితులని, ఆదివారం ఫోన్‌ చేశారన్నారు.


సోమవారం రాయచూరుకు వస్తున్నానని, అక్కడికే రావాలని సూచించారన్నారు. కానీ కలబురగిలో ఉన్నానని ఇప్పటికిప్పుడు రాలేనని వివరణ ఇచ్చానన్నారు. 25న బెంగళూరులో ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. గృహనిర్మాణశాఖలో అవినీతి వాస్తవమన్నారు. మైనారిటీశాఖ నుంచి ఆళంద నియోజకవర్గానికి 17 కోట్ల రూపాయలు విడుదల చేశారని ఆ విషయం స్థానిక ఎమ్మెల్యేగా తనకే తెలియదన్నారు.


pandu1.2.jpg

ఇప్పటికే పాఠశాల భవనాలు నిర్మిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించారన్నారు. మౌలానా ఆజాద్‌ పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామని అంటున్నారు. కానీ కల్యాణ కర్ణాటక నిధులను వాడుతున్నారన్నారు.తన ఆడియోలో ఏ మంత్రిపేరు ప్రస్తావించలేదని, మంత్రి పీఎ్‌సతో మాట్లాడానని అయితే ఆడియో ఎలా వైరల్‌ అయ్యిందో తెలియదన్నారు. కానీ మాట్లాడింది వాస్తవమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 01:32 PM