MEA on USAID Funds: యూఎస్ఏఐడీ నిధుల వ్యవహారం కలవరపెడుతోంది.. ఎంఈఏ స్పందన
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:43 PM
అమెరికా కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్ సమాచారం తీవ్రంగా కలవరపెడుతోందని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.
న్యూఢిల్లీ: భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియలో జ్యోకం చేసుకునేందుకు గత బైడెన్ ప్రభుత్వం 21 మిలియన్ డాలర్లు కేటాయించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేయడం, అక్కడ ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నం చేసినట్టు ఉందని వ్యాఖ్యనించడంపై భారత విదేశాంగ శాఖ (MEA) శుక్రవారంనాడు స్పందించింది. అమెరికా కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్ సమాచారం తీవ్రంగా కలవరపెడుతోందని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) అన్నారు.
USAID Funds: భారత ఎన్నికల్లో అమెరికా జోక్యంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రగడ
''యూఎస్ఏ కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్ పేర్కొన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇది తీవ్రంగా కలవరచే అంశం. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకే వస్తుంది. దీనిపై సంబంధిత శాఖలు, ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు దీనిపై వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది. సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత దీనిపై అప్డేడ్‌తో మీ ముందుకు వస్తాం" అని మీడియాతో మాట్లాడుతూ రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ గురువారంనాడు వాషింగ్టన్ డీసీలో జరిగిన రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో ఎన్నికల కోసం మనం 21 మిలియన్ డాలర్లు ఎందుకు కేటాయించాలి? మనకే చాలా సమస్యలు ఉన్నాయి. మనం మన ఎన్నికల గురించి చూసుకోవాలి. భారత్‌లో ఎన్నికల కోసం 21 మిలియన్ డాలర్లు కేటాయించిన విషయం మీకు తెలుసా? అక్కడే ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది కిక్‌బ్యాక్ స్కీమ్‌లా కనిపిస్తోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి ముందు ఫిబ్రవరి 16న అమెరికా డోజ్ శాఖ యూఎస్ఏఐడీ నిధుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పొదుపు చర్యల్లో భాగంగా భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉద్దేశించి 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తు్న్నట్ట ప్రకటించింది.
కాగా, యూఎస్ఏఐడీ నిధులు భారత్‌లో ఎవరికి చేరాయో చెప్పాలనే డిమాండ్లు భారత్‌లో మొదలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదానికి కూడా దారితీసింది. కాంగ్రెస్ హయాంలో యూపీఏ ప్రభుత్వానికి, ఎన్జీఓలకు మిలియన్ డాలర్ల నిధులు అందాయని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక నిధుల రాకడ తగ్గిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే ఈ వాదనను కాంగ్రెస్ కొట్టివేసింది. ట్రంప్ చేసిన ఆరోపణల్లో ఆర్థం లేదని, యూఎస్ఏఐడీ నిధులు ఎవరెవరికి అందాయనే వివరాలతో ఆయన శ్వేతపత్రం విడుల చేయాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
PM Modi SOUL Conclave: అన్నిరంగాల్లో విజనరీ నేతలు తయారు కావాలి.. సోల్ సదస్సులో మోదీ
DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
Birthday: వారం ముందే సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.