Share News

PM Modi SOUL Conclave: అన్నిరంగాల్లో విజనరీ నేతలు తయారు కావాలి.. సోల్ సదస్సులో మోదీ

ABN , Publish Date - Feb 21 , 2025 | 03:51 PM

ఇండియా గ్రోత్ గురించి మోదీ వివరిస్తూ 21వ శతాబ్దిలో వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు అవిశ్రాంతంగా కృషి చేస్తు్న్నారని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి రంగంలోనే ఉత్తమ నాయకత్వం అవసరమని, అది కేవలం రాజకీయాలకే పరిమిత కారాదని అన్నారు.

PM Modi SOUL Conclave: అన్నిరంగాల్లో విజనరీ నేతలు తయారు కావాలి.. సోల్ సదస్సులో మోదీ
PM Modi

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మార్పు తెచ్చే విజనరీ నేతలు తయారు కావాలని, స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్ షిప్ (SOUL) ఇందుకు ఎంతో దోహదపడుతుందని తాను ఆశిస్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారంనాడు జరిగిన 'సోల్' లీడర్‌షిప్ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ, వికసిత్ భారత్ (అభివృద్ధి భారతం) జర్నీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూషన్ ప్రారంభించడం ఒక ల్యాండ్‌మార్క్ అవుతుందన్నారు.

Eknath Shinde: నన్ను ఆషామాషీగా తీసుకోవద్దు.. డిప్యూటీ సీఎం హెచ్చరిక


''జాతి నిర్మాణంలో పౌరుల అభివృద్ధి కీలకం. మనకు ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయి నాయకులు కావాలి. ఆ దిశగా మన ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ కీలకమైన ముందడుగు అవుతుంది'' అని మోదీ అన్నారు. గిఫ్ట్ (GIFT) సిటీ సమీపంలో సోల్ కొత్త క్యాంపస్ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఆర్కిటెక్చరల్ అచీవ్‌మెంట్ ఇదొక బెంచ్‌మార్క్ అవుతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన మోడల్, ప్లాన్‌ను తనకు చైర్మన్ చూపించారని చెప్పారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనే నాయకత్వం అవసరం ఉందని మోదీ చెప్పారు. యువ నేతలతోనే ఇండియాలో మార్పు సాధ్యమని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ప్రధాని గుర్తు చేశారు. వందమంది శక్తివంతులైన యువతీయువకులను తనకు ఇస్తే ఇండియాను మార్చి చూపిస్తానని ఆయన చెప్పేవారని, సరైన నాయకులతో ఇండియా కేవలం ఫ్రీడం పొందడమే కాకుండా గ్లోబల్ లీడర్‌గా కూడా నిలుస్తుందని తాను బలంగా నమ్ముతానని ప్రధాని చెప్పారు.


ఇండియా గ్రోత్ గురించి మోదీ వివరిస్తూ 21వ శతాబ్దిలో వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు అవిశ్రాంతంగా కృషి చేస్తు్న్నారని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి రంగంలోనే ఉత్తమ నాయకత్వం అవసరమని, అది కేవలం రాజకీయాలకే పరిమిత కారాదని అన్నారు. వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ, గవర్నెన్స్‌లోనూ అత్యున్నత నాయకత్వం అవసరమని చెప్పారు. ది స్కూల్ ఆఫ్ అల్డిమేట్ లీడర్‌షిప్‌ రేపటి నేతలను రూపొందిస్తుందనే నమ్మకం తనకుందని, ఇందులో కొందరు రాజకీయాల్లోనూ కీలకం కావచ్చని అన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి సాధించింది అంటే సహజంగా అందులోని సహజవనరుల పాత్ర కీలకంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మానవవనరుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది


గుజరాత్ ప్రగతిని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, గుజరాత్, మహారాష్ట్ర విడిపోయినప్పుడు గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందనే ఆందోళన వ్యక్తమయిందని చెప్పారు. గుజరాత్‌లో బొగ్గు లేదు, కీలకమైన సహజవనరులు లేవు, నీళ్లు లేవు, కేవలం ఎడారి, పాకిస్థాన్ సరిహద్దు అని చెప్పేవారని గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగా గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని, ఎకనామిక్ పవర్‌హౌస్‌గా నిలిచిందని అన్నారు.


సోల్ కాంక్లేవ్‌లో భూటాన్ ప్రధాని షేరింగ్‌ తోబ్గే పాల్గొన్నారు. 'సోల్' అనేది మోదీకి వచ్చిన కళాత్మక ఆలోచన అని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. యువతను శక్తివంతగా రూపొందించడంలో మోదీకి ఉన్న అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. తాను ఒక విద్యార్థిగానే ఇక్కడకు వచ్చానని, ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరున్న నరేంద్ర మోదీ నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు. సరైన నాయకులు దేశాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని, అలాంటి నాయకుడే మోదీ అని ప్రశంసించారు. మోదీ తనకు పెద్దన్న వంటి వారని అన్నారు.


ఇవి కూడా చదవండి..

DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

Birthday: వారం ముందే సీఎం స్టాలిన్‌ జన్మదిన వేడుకలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 21 , 2025 | 04:26 PM