MEA: భారత్‌లో అవామీ లీగ్ కార్యాలయం.. బంగ్లా ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:12 PM
ఇండియాలో అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం కానీ, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తుండటం కానీ తమ దృష్టికి రాలేదని ఎంఈఓ ఆ ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా భారత భూభాగం నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది.
న్యూఢిల్లీ: నిషేధిత బంగ్లాదేశ్ అవామీ లీగ్ (Awami League) రాజకీయ కార్యాలయాన్ని భారత్ నుంచి నడుపుతున్నారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం బుధవారంనాడు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత భూభాగం నుంచి ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటన చేసింది.
ఇండియాలో అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం కానీ, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం కానీ తమ దృష్టికి రాలేదని ఎంఈఓ ఆ ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా భారత భూభాగం నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది. సాధ్యమైనంత త్వరలో అన్ని పార్టీలను కలుపుకుని బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలని తాము ఆశిస్తున్నట్టు కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల 'అవామీ లీగ్' పార్టీపై నిషేధం విధించింది. తమ దేశంలో నిషేధించిన అవామీ లీగ్ కార్యాలయాలను భారత్ నుంచి నడుపుతున్నారని, న్యూఢిల్లీ, కోల్‌కతాలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో బంగ్లా ఆరోపణలను భారత్ తాజాగా తిప్పికొట్టింది.
ఇవి కూడా చదవండి..
Rahul Gandhi On BJP New Bill: మధ్యయుగాలకు నెట్టేసే బిల్లు: రాహుల్ గాంధీ
Army Chief: అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆర్మీ చీఫ్ దంపతులు
For National News And Telugu News