Bharat Bandh: భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు..ఎప్పుడంటే..
ABN , Publish Date - May 31 , 2025 | 04:40 PM
భారతదేశ వ్యాప్తంగా బంద్ చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖను విడుదల చేశారు.
అమరావతి: మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు (Maoist bandh call India) పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నారు. జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించింది. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపడం లేదని మావోయిస్టులు ప్రశ్నించారు. 2 నెలలుగా తాము సంయమనం పాటించామని చెప్పుకొచ్చారు.కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్ పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖను విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News