Asanna Surrender: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:19 PM
మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత ఆశన్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయాడు.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత ఆశన్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.
ఛత్తీస్ గఢ్(Chhattisgarh) దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతోపాటు 130 మంది లొంగిపోయారు. ఆశన్నతోపాటు 130 మంది మావోయిస్టుల(130 other Naxals)ను బీజాపూర్ పోలీసులు బస్సులో తరలించారు. ఈ క్రమంలో లొంగిపోయిన నక్సలైట్లందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించి సరెండర్ అయ్యారు. వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అగ్రనేతలు కూడా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించి.. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్ కల్యాణ్