Rahul Mamkootathil list includes Transgenders : కేరళ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రాన్స్‌జెండర్లను కూడా వదల్లేదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:02 PM
కేరళ తాజా మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పాలక్కాడ్ ఎమ్మెల్యే మమ్‌కూటథిల్ ఆఖరికి ట్రాన్స్‌జెండర్లను కూడా వదల్లేదని బిజెపి నాయకురాలు నవ్య హరిదాస్ అన్నారు.
కొచ్చి (కేరళ), ఆగస్టు 22 : కేరళ తాజా మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పాలక్కాడ్ ఎమ్మెల్యే మమ్‌కూటథిల్ ఆఖరికి ట్రాన్స్‌జెండర్లను కూడా వదల్లేదని బిజెపి నాయకురాలు నవ్య హరిదాస్ అన్నారు. కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్‌కు చెందిన బిజెపి కౌన్సిల్ నాయకురాలు నవ్య హరిదాస్ శుక్రవారం ఈ ఉదంతంపై మాట్లాడారు. రచయిత్రి హనీ భాస్కరన్, మోడల్.. నటి రిని ఆన్ జార్జ్ ఫిర్యాదు చేసిన పిదప ఇంకెన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆమె తెలిపారు.
పాలక్కాడ్ ఎమ్మెల్యే మమ్‌కూటథిల్ పై చాలా మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు కూడా లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేశారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అయిన నవ్య హరిదాస్ ఆరోపించారు. 'ప్రస్తుత పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక మహిళ ఫిర్యాదు కాదు. లైంగిక వేధింపుల ఆధారంగా అతనిపై చాలా మంది మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు' అని నవ్య హరిదాస్ తెలిపారు.
'ఆ జాబితాలో ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నట్టు మరిన్ని షాకింగ్ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉదయం, ఈ కేసు పూర్వాపరాలు కూడా చూశాం. కావున, ఇవి రాహుల్‌పై నిరాధారమైన ఆరోపణలు కావు. ఈ ఆరోపణలన్నీ రుజువుతో, చాట్ హిస్టరీతో, వాయిస్ సందేశాలతో, పూర్తి సాక్ష్యాధారలతో ఉన్నాయి.' అని నవ్య చెప్పారు. మామ్‌కూటథిల్ కి వ్యతిరేకంగా పాలక్కాడ్ జిల్లాతో పాటు కేరళలోని 30 జిల్లాల్లోనూ మహిళా మోర్చా అనేక నిరసనలు చేపట్టాలని యోచిస్తోందని ఆమె అన్నారు.
ఇలాఉండగా, లైంగిక ఆరోపణల నేపథ్యంలో నిన్న (గురువారం) కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్‌కూటథిల్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
తిన్న తర్వాత చేసే ఈ ఒక్క పొరపాటులో గ్యాస్ ప్రాబ్లెం..?
బ్రోకలీ ఆరోగ్యానికి మంచిదే... కానీ వీరికి మాత్రం కాదు!