Share News

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Sep 24 , 2025 | 06:19 PM

పహల్గాం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ మహదేవ్‌'లో పలు ఆయుధాలు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం ఉగ్రవాదులకు సహకరించిన మహమ్మద్ కటారియా అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు
pahalgam attack

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack)కి సహకరించిన వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు ఇవాళ (బుధవారం) సాయంత్రం అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరాన్ వ్యాలీలో 26మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు ఇతను లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.


పహల్గాం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ మహదేవ్‌'లో పలు ఆయుధాలు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం ఉగ్రవాదులకు సహకరించిన మహమ్మద్ కటారియా అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ సమయంలో 'ఆపరేషన్ సిందూర్‌'పై పార్లమెంటులో చర్చసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.


ఇవి కూాడా చదవండి..

రాష్ట్ర హోదా ఆందోళనలు హింసాత్మకం.. నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్

లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్‌..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2025 | 07:52 PM