Deputy CM Account Hacked: డిప్యూటీ సీఎం అకౌంట్ హ్యాక్..పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్ట్ వైరల్
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:09 PM
మహారాష్ట్ర నుంచి ఈరోజు కలకలం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారిక X ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు షాక్‌కు గురిచేసేలా పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్టులు చేయడం సంచలనంగా మారింది.
మహారాష్ట్ర నుంచి ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Maharashtra Deputy CM) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) X ఖాతా ఈరోజు ఉదయం హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు ఈ ఖాతా నుంచి పాకిస్తాన్, టర్కీ జెండాలతో కూడిన చిత్రాలను పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఈ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఇవి చూసిన మరికొంత మంది ఒక్కసారిగా చర్చించడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం ఖాతా హ్యాక్ కావడం, అది కూడా ఇతర దేశాల జెండాలను పోస్ట్ చేయడం అనేక మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పోస్ట్‌లు కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఖాతా తిరిగి స్వాధీనం
ఈ హ్యాకింగ్ సమాచారం అందుకున్న కొద్ది సేపటికే, షిండే టెక్నికల్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. అనధికారికంగా పోస్ట్ చేసిన అన్ని పోస్ట్‌లను తొలగించింది. షిండే ఖాతాను సురక్షితంగా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ ఖాతా మళ్లీ సాధారణ స్థితిలో కొనసాగుతోంది. టెక్నికల్ బృందం ఈ ఘటనపై దృష్టి సారించి, మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటోంది.

పెరుగుతున్న ముప్పు
ఈ ఘటన దేశంలో సైబర్ నేరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో స్పష్టం చేస్తోంది. డిజిటల్ లావాదేవీల పెరుగుదల, ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఏఐ వాడకం, సైబర్ దాడులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ దాడుల వల్ల ప్రతి ఏటా దేశం భారీగా నష్టపోతుంది. హ్యాకర్లు ఇలాంటి దాడులతో గందరగోళం సృష్టించడమే కాక, సమాజంలో భయాందోళనలను కూడా సృష్టిస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు
ప్రభుత్వం సైబర్ నేరాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. సైబర్ సెక్యూరిటీ విభాగాలను సైతం బలోపేతం చేస్తోంది. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ హ్యాకింగ్‌ను నిరోధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచడం చాలా ముఖ్యం. సోషల్ మీడియా ఖాతాలను సురక్షితంగా ఉంచడానికి బలమైన పాస్‌వర్డ్‌లు, టూ-ఫాక్టర్ ఆథంటికేషన్ వంటి భద్రతా చర్యలను అనుసరించాలని టెక్ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి